అమెరికాలో దొరికిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు.. హిమాన్షు భావు, నీరజ్ ఫరీద్‌పురియాలను అరెస్ట్ చేసిన ఎఫ్‌బీఐ!
Indian Most Wanted Gangsters: మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ హిమాన్షు భావు, నీరజ్ ఫరీద్‌పురియా అమెరికాలో అరెస్ట్.
అమెరికాలో దొరికిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు.. హిమాన్షు భావు, నీరజ్ ఫరీద్‌పురియాలను అరెస్ట్ చేసిన ఎఫ్‌బీఐ!
Indian Most Wanted Gangsters: భారతదేశంలో పలుసంచలన హత్యలు, దోపిడీలు, ఆయుధాల స్మగ్లింగ్ వంటి తీవ్రమైన కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్లు హిమాన్షు భావు, ఆయన సహచరుడు నీరజ్ ఫరీద్‌పురియాలను అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) అధికారులు అరెస్ట్ చేశారు. అమెరికాలోని లాస్ వెగాస్ కేంద్రంగా తలదాచుకున్న వీరిద్దరిని స్థానిక దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి. భారత కేంద్ర నిఘా వర్గాలు, హరియాణా స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) అందించిన పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ విజయవంతమైంది.
హరియాణాలోని రోహ్‌తక్ జిల్లా రిటోలి గ్రామానికి చెందిన హిమాన్షు భావుపై దిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో హత్యలు, హత్యాయత్నాలు, కిడ్నాప్‌లు, వసూళ్లు వంటి దాదాపు 25కి పైగా తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2020లో హరియాణాలోని హిసార్ బాల సంరక్షణ కేంద్రం నుంచి పరారైన అతను, ఆ తర్వాత విదేశాలకు పారిపోయి అక్కడి నుంచే తన నేర సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నాడు. విదేశాల్లో తలదాచుకుంటూ దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ప్రముఖులు, వ్యాపారులను బెదిరించి వసూళ్లకు పాల్పడటంతో పాటు పలు కాల్పుల ఘటనలకు బాధ్యత వహించాడు. ఈ క్రమంలో 2023లో అతనిపై ఇంటర్‌పోల్ 'రెడ్ కార్నర్ నోటీసు' జారీ చేసింది.
హరియాణాలోని పలవల్ జిల్లాకు చెందిన నీరజ్ ఫరీద్‌పురియాపై కూడా 25కి పైగా క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2019లో జరిగిన కాంగ్రెస్ రాష్ట్ర ప్రవక్త వికాస్ చౌదరి హత్య కేసులోనూ ఇతని పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత దుబాయ్ మీదుగా కెనడాకు పారిపోయిన నీరజ్, అక్కడ బంబిహా గ్యాంగ్‌తో సంబంధాలు కొనసాగించి.. ఆ తర్వాత అమెరికాకు మకాం మార్చాడు. అక్కడ హిమాన్షు భావు గ్యాంగ్‌తో కలిసి కార్యకలాపాలు సాగిస్తున్నాడు.
అమెరికాలో ఎఫ్‌బీఐ అధికారుల చేతిలో చిక్కిన ఈ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లను వీలైనంత త్వరగా భారత్‌కు రప్పించేందుకు హరియాణా ఎస్‌టీఎఫ్ మరియు భారత దౌత్య, భద్రతా అధికారులు అమెరికా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలోనే వీరిద్దరినీ స్వదేశానికి తీసుకువచ్చి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.




