Kash Patel: గాయని అలెక్సిస్ విల్కిన్స్‌తో ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్ ఎంగేజ్మెంట్.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
Kash Patel: అమెరికా ఎఫ్‌బీఐ డైరెక్టర్, భారత సంతతికి చెందిన కాష్ పటేల్, యూఎస్ సింగర్ అలెక్సిస్ విల్కిన్స్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు.
Kash Patel: గాయని అలెక్సిస్ విల్కిన్స్‌తో ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్ ఎంగేజ్మెంట్.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
Kash Patel: అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) డైరెక్టర్, భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యక్తి కాష్ పటేల్ ఓ ఇంటివాడయ్యేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ అమెరికన్ గాయకురాలు, రాజకీయ వ్యాఖ్యాత అయిన అలెక్సిస్ విల్కిన్స్‌తో ఆయనకు ఆదివారం ఘనంగా నిశ్చితార్థం జరిగింది.
ఈ మధురమైన విషయాన్ని ఈ నూతన జంట తమ అధికారిక సామాజిక మాధ్యమాల వేదికగా ప్రపంచంతో పంచుకుంది. గాయని విల్కిన్స్ తన ఎంగేజ్మెంట్ ఉంగరాన్ని చూపిస్తూ.. కాష్ పటేల్‌తో దిగిన అందమైన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ జోడీకి ప్రముఖులు, అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
46 ఏళ్ల కాష్ పటేల్, 27 ఏళ్ల అలెక్సిస్ విల్కిన్స్ గత కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. వీరు 2023 నుంచి ప్రేమలో ఉన్నట్లు సమాచారం.
అలెక్సిస్ విల్కిన్స్ గాయనిగా మంచి గుర్తింపు పొందడమే కాకుండా, 2023లో తన తొలి మ్యూజిక్ ఆల్బమ్‌ను విడుదల చేశారు. అంతేకాకుండా ఆమె అమెరికాలో రాజకీయ వ్యాఖ్యాతగానూ కొనసాగుతున్నారు.
డోనాల్డ్ ట్రంప్ మద్దతుతో 2025లో కాష్ పటేల్ ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి అలెక్సిస్ విల్కిన్స్ కూడా హాజరయ్యారు.
కాష్ పటేల్ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితం తరచూ చర్చనీయాంశమవుతుంటుంది. గతంలో ఆయనపై ప్రభుత్వ విమానాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించారనే ఆరోపణలు వచ్చాయి. విల్కిన్స్ పాల్గొన్న ఓ కార్యక్రమానికి వెళ్లేందుకు ఆయన ఎఫ్‌బీఐ అధికారిక జెట్‌ను వాడారనే విమర్శలు కూడా అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి.




