90 కోట్ల గెలాక్సీలు.. విశ్వం రహస్యాలను విప్పిన యూక్లిడ్
Euclid Telescope: అంతుచిక్కని విశ్వ రహస్యాలను ఛేదించే దిశగా అంతరిక్ష పరిశోధన మరో చారిత్రక మైలురాయిని అధిగమించింది. విశ్వాంతరాలంలో దాగివున్న మహా..
90 కోట్ల గెలాక్సీలు.. విశ్వం రహస్యాలను విప్పిన యూక్లిడ్
Euclid Telescope: అంతుచిక్కని విశ్వ రహస్యాలను ఛేదించే దిశగా అంతరిక్ష పరిశోధన మరో చారిత్రక మైలురాయిని అధిగమించింది. విశ్వాంతరాలంలో దాగివున్న మహా అద్భుతాలను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA)కి చెందిన అత్యాధునిక 'యూక్లిడ్ టెలిస్కోప్' (Euclid telescope) మన కళ్లముందు కనువిందుగా ఆవిష్కరించింది. ఈ టెలిస్కోప్ సేకరించిన సుమారు 13 నెలల సమచారాన్ని శాస్త్రవేత్తలు తాజాగా క్రోడీకరించి 'డేటా రిలీజ్-1 ఫౌండేషన్' పేరిట విడుదల చేశారు. ఈ అద్భుతమైన డేటాలో ఏకంగా 90 కోట్లకు పైగా గెలాక్సీలు దర్శనమివ్వడం అంతరిక్ష శాస్త్రవేత్తలను సైతం విస్మయానికి గురిచేస్తోంది.
ప్రత్యేక ఆకర్షణగా 'మెస్సియర్ 81' గెలాక్సీ
యూక్లిడ్ టెలిస్కోప్ పంపిన ఈ సరికొత్త విశ్వ చిత్రాల్లో భూమికి దాదాపు 1.20 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న 'మెస్సియర్ 81' (M81) అనే స్పైరల్ గెలాక్సీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనితో పాటు 'అబెల్ 3128' వంటి భారీ గెలాక్సీల గుంపులు (Galaxy Clusters) కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. విశ్వం యొక్క ఆవిర్భావం, అందులోని చీకటి పదార్థం (Dark Matter), చీకటి శక్తి (Dark Energy) రహస్యాలను ఛేదించడంలో ఈ డేటా అత్యంత కీలకమైనదని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ అద్భుత చిత్రాలు భవిష్యత్తులో విశ్వ రహస్యాల గుట్టు విప్పడానికి సరికొత్త దారులు చూపనున్నాయి.




