Elon Musk: ఎలాన్ మస్క్‌కు భారీ షాక్.. విడిపోయినట్లు ప్రకటించిన గర్ల్‌ఫ్రెండ్ శివన్ జిలిస్

Elon Musk: టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ భాగస్వామి శివన్ జిలిస్ తమ రిలేషన్‌షిప్ ముగిసినట్లు ప్రకటించారు. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా మస్క్ తనతో బ్రేకప్ చెప్పినట్లు ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు.

CR Reddy
Published on: 3 Oct 2026 7:04 AM IST
Elon Musk
X

Elon Musk

Elon Musk: ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ వ్యక్తిగత జీవితంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆయన భాగస్వామి, ప్రముఖ టెక్ ఎగ్జిక్యూటివ్ శివన్ జిలిస్ తన రిలేషన్‌షిప్‌కు ముగింపు పలికినట్లు అధికారికంగా ప్రకటించారు. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేదా సమాచారం ఇవ్వకుండానే మస్క్ తనతో బ్రేకప్ చెప్పినట్లు ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ వార్త ప్రస్తుతం టెక్ వర్గాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఒక వారంలోనే మారిపోయిన బంధం

భారతీయ మూలాలు కలిగి కెనడాలో జన్మించిన శివన్ జిలిస్, సోషల్ మీడియా వేదిక ఎక్స్‎లో ఒక సుదీర్ఘ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టారు. ప్రేమలో ఉన్నతాము అనుకున్న దశ నుంచి ఎలాంటి హెచ్చరిక లేకుండా కేవలం ఒక్క వారంలోనే విడిపోవాల్సి రావడం చాలా బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జీవితంలో కొన్ని పరిస్థితులు అనుకున్న విధంగా జరగవని, ఈ బ్రేకప్ తనను ఎంతగానో కలిచివేసిందని ఆమె పేర్కొన్నారు. అయినప్పటికీ మస్క్ పట్ల తనకు ఎప్పటికీ గౌరవం ఉంటుందని, ఆయన సంతోషాన్ని కోరుకుంటానని తెలిపారు.

మస్క్‌తో ఉన్న నలుగురు పిల్లలు

ఎలాన్ మస్క్, శివన్ జిలిస్‌లకు నలుగురు పిల్లలు ఉన్నారు. 2021లో వీరికి కవల పిల్లలు (స్ట్రైడర్, అజూర్) జన్మించగా, 2024లో ఆర్కాడియా అనే కుమార్తె పుట్టింది. అలాగే 2025 ప్రారంభంలో వీరి చిన్న కుమారుడు సెల్డన్ జన్మించినట్లు ప్రకటించారు. తమ పిల్లల కోసం తామిద్దరం మంచి స్నేహితులుగా, బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా కొనసాగుతామని జిలిస్ ఆశాభావం వ్యక్తం చేశారు. కష్టకాలంలో మస్క్‌కు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని, స్థిరమైన ప్రేమను అందించడానికి తాను ఎంతగానో ప్రయత్నించానని తెలిపారు.

బయటపడిన చివరి చాట్ స్క్రీన్‌షాట్లు

ఈ బ్రేకప్‌కు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ జిలిస్ తాము ఇటీవల జరుపుకున్న టెక్స్ట్ మెసేజ్‌ల స్క్రీన్‌షాట్లను కూడా షేర్ చేశారు. సెప్టెంబర్ 24న బ్రేక్‌ఫాస్ట్ సమయంలో కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని, తాను మస్క్‌ను ఎంతో ప్రేమిస్తున్నానని జిలిస్ మెసేజ్ చేయగా, మస్క్ కూడా బదులుగా "లవ్ యూ టూ" అని రిప్లై ఇచ్చారు. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ కోసం జరిగిన వైట్‌హౌస్ స్టే డిన్నర్‌కు ఆమెను ఆహ్వానించలేకపోయినందుకు మస్క్ చింతిస్తున్నట్లు ఆ చాట్‌లో ఉంది. ఆ మెసేజ్‌లు జరిగిన కొద్ది రోజులకే వీరిద్దరి మధ్య బ్రేకప్ జరగడం గమనార్హం. ప్రస్తుతం మస్క్ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.