Donald Trump: వైట్‌హౌస్‌లో దీపావళి వెలుగులు.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా!
Donald Trump: వాషింగ్టన్‌లోని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ మరోసారి భారతీయ సంస్కృతీ సంప్రదాయాల వెలుగులతో నిండిపోయింది.
Donald Trump: వైట్‌హౌస్‌లో దీపావళి వెలుగులు.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా!
Donald Trump: వాషింగ్టన్‌లోని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ మరోసారి భారతీయ సంస్కృతీ సంప్రదాయాల వెలుగులతో నిండిపోయింది. ఓవల్ ఆఫీస్‌లో జరిగిన దీపావళి సంబరాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైభవంగా నిర్వహించారు. చీకటిపై వెలుగుల విజయాన్ని ప్రతిబింబిస్తూ సాగిన ఈ వేడుకలో డోనాల్డ్ ట్రంప్ స్వయంగా దీపాలను వెలిగించారు.
ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సమాజానికి, ప్రవాస భారతీయులకు ఆయన హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. భారత్-అమెరికన్ల మధ్య ఉన్న సాంస్కృతిక బంధాన్ని మరింత బలోపేతం చేసే విధంగా ఈ వేడుకను ఓవల్ ఆఫీస్‌లో 'సహకార వెలుగుల క్షణం'గా అభివర్ణించారు.
కార్పొరేట్ దిగ్గజాలు, ప్రముఖుల కలయిక
ఈ ప్రత్యేక కార్యక్రమంలో భారతీయ-అమెరికన్ పరిశ్రమాధిపతులు, కార్పొరేట్ సంస్థల సీఈఓలు, ప్రముఖ వ్యాపారవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమెరికాలోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా, ఐబీఎమ్ సీఈఓ అర్వింద్ కృష్ణ, మైక్రాన్ టెక్నాలజీ అధిపతి సంజయ్ మెహ్రోత్రా, ప్రసిద్ధ మాస్టర్ షెఫ్ వికాస్ ఖన్నా, జికియూఐఐ వ్యవస్థాపకుడు విశాల్ గోండల్, రూబీ ధల్లా, నాక్ సిస్టమ్స్ ఫౌండర్ రాజీవ్ శర్మలతో పాటు కేశవం డీసీ ప్రెసిడెంట్ విశ్వజిత్ మల్లంపాటి, వైట్ హౌస్ ఈవెంట్స్ ప్రతినిధులు యశర్ అరవింద్ చాదా, హేతల్ కుమార్ పటేల్ వంటి పలువురు ప్రముఖులు ఈ సంబరాల్లో ప్రత్యక్షంగా భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచ శాంతి, సమృద్ధి, మంచి ఆరోగ్యం , అందరి దీర్ఘాయుష్షు కోసం వికాస్ ఖన్నా ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ట్రంప్‌కు హనుమాన్ చాలీసా బహుకరణ
ఈ వేడుకలో ఒక అరుదైన, ఆసక్తికరమైన ఘట్టం చోటుచేసుకుంది. రెండు దేశాల మధ్య బలమైన స్నేహాన్ని కాంక్షిస్తూ, భారతీయ సంస్కృతికి ప్రతీకగా విశాల్ గోండల్ ద్వారా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ‘హనుమాన్ చాలీసా’ ప్రతిని బహుకరించారు. భక్తి, ధైర్యం, శక్తికి నిదర్శనంగా తులసీదాస్ రచించిన ఈ పవిత్ర చాలీసాను ట్రంప్‌కు అందించడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు గోండల్ వెల్లడించారు. ‘జుగ్ జుగ్ జీయో’ (చల్లగా వర్ధిల్లు) అనే మంగళాశాసనాలతో వేడుక వాతావరణం ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభను సంతరించుకుంది.
రెండు పదుల వైట్‌హౌస్ దీపావళి చరిత్ర
వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు జరగడం కొత్తేమీ కాదు. 2003లో అప్పటి అధ్యక్షుడు జార్జ్ బుష్ హయాంలో అత్యంత సాధారణంగా మొదలైన ఈ సంప్రదాయం, కాలక్రమేణా పెద్ద ఎత్తున నిర్వహించే అధికారిక వేడుకగా మారింది. 2009లో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ వేడుకలను వైట్‌హౌస్ ఈస్ట్ రూమ్‌కు విస్తరించారు. అయితే, ఓవల్ ఆఫీస్‌లో స్వయంగా ప్రమిదలు వెలిగించిన మొదటి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నిలిచారు. తన మొదటి విడత పాలనా కాలంలోనూ ఆయన దీపావళిని ఘనంగా నిర్వహించగా, ఇప్పుడు కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తూ అమెరికాలో భారతీయ సంస్కృతికి ఇస్తున్న ప్రాధాన్యతను పునరుద్ఘాటించారు.




