Donald Trump: ‘సుందర్ పిచాయ్ వద్దన్నారు.. లేకపోతే ఆ పేరు మారేది!’
Donald Trump: అట్లాంటిక్ మహాసముద్రం పేరును 'అమెరికన్ ఓషన్'గా మార్చాలని భావించినట్లు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
Donald Trump: ‘సుందర్ పిచాయ్ వద్దన్నారు.. లేకపోతే ఆ పేరు మారేది!’
Donald Trump: అట్లాంటిక్ మహాసముద్రం పేరును ‘అమెరికన్ ఓషన్’గా మార్చాలని భావించినట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సౌత్ కరోలినాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రతిపాదనపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో కూడా చర్చించినట్లు తెలిపారు.
మహాసముద్రం పేరు మార్పుపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌ను సంప్రదించగా.. మహాసముద్రాలు ప్రపంచంలోని అనేక దేశాల సరిహద్దులను తాకుతుంటాయని, అందువల్ల వాటి పేర్లను మార్చడం అంత సులభం కాదని పిచాయ్ స్పష్టం చేసినట్లు ట్రంప్ వివరించారు. టెక్నికల్ మరియు అంతర్జాతీయ ఇబ్బందుల దృష్ట్యా అట్లాంటిక్ మహాసముద్రం పేరు మార్చే ఆలోచనను ప్రస్తుతానికి విరమించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అట్లాంటిక్‌తో పాటు పసిఫిక్ మహాసముద్రానికి కూడా ‘అమెరికన్ ఓషన్’ అని పేరు పెట్టే అంశాన్ని పరిశీలిస్తానని ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాగే ఇరాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన ‘హర్మూజ్ జలసంధి’ని ప్రస్తుతం ‘ట్రంప్ స్ట్రెయిట్’ అని పిలుస్తున్నారని వ్యాఖ్యానించారు.
గతంలో ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ పేరును ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’ గా మారుస్తూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేయగా, ఆ తర్వాత అమెరికా వినియోగదారుల కోసం గూగుల్ మ్యాప్స్‌లో కూడా ఆ పేరు మారడం గమనార్హం. ఇటీవల ఒక సరస్సుకు ‘లేక్ అమెరికా’ అని పేరు పెట్టిన విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.




