Donald Trump: నేను 8 యుద్ధాలు ఆపాను.. నాకు 8 నోబెల్స్ రావాలి.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Donald Trump: ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి తనకు రాకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

Arun Chilukuri
Published on: 10 Oct 2026 12:47 PM IST
Donald Trump
X

Donald Trump: నేను 8 యుద్ధాలు ఆపాను.. నాకు 8 నోబెల్స్ రావాలి.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Donald Trump: ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి తనకు రాకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సిరాక్యూస్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన నార్వేలోని నోబెల్ కమిటీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాను ఇప్పటివరకు ఎనిమిది యుద్ధాలను ఆపానని, పరిష్కరించిన ప్రతి యుద్ధానికి ఒక నోబెల్ బహుమతి చొప్పున తనకు మొత్తం ఎనిమిది సార్లు ఈ పురస్కారం రావాల్సిందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఈ ఏడాది దక్షిణాఫ్రికాకు చెందిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మాజీ కమిషనర్ నవీ పిళ్లైకి నోబెల్ శాంతి బహుమతి దక్కడంపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. నోబెల్ ఎవరికీ ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్న వారు అవమానకరమైన పని చేశారని, కమిటీ సభ్యులు ‘రాడికల్ ఐడియాలజిస్టులు, ప్రజాస్వామ్య వ్యతిరేకులు’ అని మండిపడ్డారు. ఇది నార్వేకు శాశ్వత మచ్చ అని అభివర్ణించారు.

తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎనిమిది యుద్ధాలను ఆపానని, ముఖ్యంగా భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం జరగకుండా నివారించి సుమారు 5 కోట్ల మంది ప్రాణాలను కాపాడానని ట్రంప్ అన్నారు. అలాగే ఇరాన్ అణుబాంబు సంపాదించకుండా అడ్డుకున్నానని తెలిపారు.

గతంలో నలుగురు అమెరికా అధ్యక్షులు (థియోడర్ రూజ్‌వెల్ట్, వుడ్రో విల్సన్, జిమ్మీ కార్టర్, బరాక్ ఒబామా) నోబెల్ శాంతి బహుమతులు అందుకున్నారని, ముఖ్యంగా ఒబామా అధ్యక్షుడైన తొలి ఏడాదిలోనే ఎలాంటి పనులు చేయకుండానే ఆ పురస్కారం పొందారని ట్రంప్ విమర్శించారు.

ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని దక్కించుకున్న నవీ పిళ్లై అంతర్జాతీయ చట్టాల పరిరక్షణకు, మానవ హక్కుల కోసం చేసిన సేవలకు గాను నార్వే నోబెల్ కమిటీ ఈ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.