కెనడా సర్రే వాల్‌మార్ట్ బయట కాల్పులు.. భారత సంతతికి చెందిన ఇద్దరు మృతి

Canada Shooting: కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో ఉన్న సర్రే ప్రాంతంలోని ఒక వాల్‌మార్ట్ స్టోర్ బయట జరిగిన కాల్పుల ఘటనలో భారత సంతతికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

G Krishna
Published on: 21 Nov 2026 7:19 PM IST
Canada Shooting
X

కెనడా సర్రే వాల్‌మార్ట్ బయట కాల్పులు.. భారత సంతతికి చెందిన ఇద్దరు మృతి

Canada Shooting: కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో ఉన్న సర్రే ప్రాంతంలోని ఒక వాల్‌మార్ట్ స్టోర్ బయట జరిగిన కాల్పుల ఘటనలో భారత సంతతికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇది వ్యవస్థీకృత నేర ముఠాలతో సంబంధం ఉన్న లక్షిత దాడిగా పోలీసులు భావిస్తున్నారు. నవంబర్ 15 రాత్రి ఈ కాల్పులు జరిగినట్లు ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఐహెచ్‌ఐటీ) వెల్లడించింది.

మృతుల వివరాలు.. నేపథ్యం ఇదీ

వాల్‌మార్ట్ స్టోర్ వెలుపల జరిగిన కాల్పుల్లో 23 ఏళ్ల గగన్‌ప్రీత్ రెహల్, 24 ఏళ్ల సుఖ్‌జీత్ కౌర్ మృతి చెందారు. వీరిద్దరూ డెల్టా ప్రాంతంలో నివాసం ఉండేవారని దర్యాప్తు బృందం తెలిపింది. రెహల్‌కు గతంలో ఆయుధాలకు సంబంధించిన కేసుల్లో పోలీసు రికార్డులు ఉన్నాయని, కౌర్‌కు కెనడాలో పెద్దగా పరిచయాలు లేవని నివేదికలో పేర్కొన్నారు.

కారు దహనంతో లింక్.. ముందస్తు ప్లాన్

కాల్పులు జరిగిన రోజు స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10:51 గంటల ప్రాంతంలో సమీపంలో ఒక కారు కాలిపోయిన ఘటన చోటుచేసుకుంది. ఈ కారు అగ్నిప్రమాదానికి, కాల్పుల ఘటనకు సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. దాడికి పాల్పడిన నిందితులు ఈ వాహనాన్నే ఉపయోగించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో, ఈ దాడిని ముందస్తు ప్రణాళికతో చేశారని, వ్యవస్థీకృత నేరాలతో దీనికి లింక్ ఉందని ఐహెచ్‌ఐటీ స్పష్టం చేసింది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.