Donald Trump: మరోసారి ట్రంప్‌ను హత్య చేసుందుకు ప్లాన్.. వైట్‌హౌస్ వద్ద కలకలం!

Donald Trump: వైట్‌హౌస్ సమీపంలో అనుమానాస్పదంగా నిలిపివుంచిన ఒక పికప్ ట్రక్కును పరిశీలించిన సీక్రెట్ సర్వీస్ అధికారులకు దిగ్భ్రాంతికరమైన విషయాలు తెలిశాయి.

G Krishna
Published on: 7 Nov 2026 11:32 AM IST
Donald Trump
X

Donald Trump: మరోసారి ట్రంప్‌ను హత్య చేసుందుకు ప్లాన్.. వైట్‌హౌస్ వద్ద కలకలం!

Donald Trump: అమెరికాలోని శ్వేతసౌధం (White House) వెలుపల తీవ్ర కలకలం రేగింది. వైట్‌హౌస్ సమీపంలో అనుమానాస్పదంగా నిలిపివుంచిన ఒక పికప్ ట్రక్కును పరిశీలించిన సీక్రెట్ సర్వీస్ అధికారులకు దిగ్భ్రాంతికరమైన విషయాలు తెలిశాయి. ఆ వాహనంలో భారీగా ఆయుధాలు ఉండటంతో పాటు, దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హతమార్చేందుకే తాను వచ్చినట్లు నిందితుడు అంగీకరించడం సంచలనం సృష్టించింది.

అర్ధరాత్రి అనుమానాస్పదంగా..

అమెరికా కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాಟకముందు వైట్‌హౌస్ కాంప్లెక్స్ సమీపంలోని కాన్‌స్టిట్యూషన్ అవెన్యూ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఒక యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఆఫీసర్‌కు నీలిరంగు ఫోర్డ్ ఎఫ్-150 పికప్ ట్రక్కు అనుమానాస్పదంగా కనిపించింది. వెంటనే అప్రమత్తమైన ఆఫీసర్ వాహనం దగ్గరకు వెళ్లి లోపల ఉన్న వ్యక్తిని వివరాలు అడగగా, ఆయన పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. ఆ వ్యక్తి వద్ద ఏమైనా ఆయుధాలు ఉన్నాయా అని ప్రశ్నించగా.. అతను తల ఊపుతూ వేళ్లతో గన్ ఆకారాన్ని చూపించాడు.

దొంగిలించిన వాహనంలో ఏఆర్-15 రైఫిల్, భారీగా ఆయుధాలు

పోలీసులు నిందితుడిని కిందకు దించి గూగుల్ ట్రాన్స్‌లేటర్ సహాయంతో మాట్లాడించారు. తన వద్ద గన్ ఉందని, ఎవరో తనను చంపడానికి ప్రయత్నిస్తే వారి నుంచి లాక్కున్నానని చెప్పాడు. వెంటనే వాహనాన్ని తనిఖీ చేయగా.. అందులో ఒక ఏఆర్-15 (AR-15) రైఫిల్‌తో పాటు మ్యాక్-10 మెషిನ್ పిస్టల్, గ్లాక్ 43ఎక్స్ పిస్టల్ లభించాయి. వీటితోపాటు డజన్ల కొద్దీ తూటాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో ఆ వాహనం సౌత్ కరోలినాలో దొంగిలించబడినట్లు తేలింది.

ట్రంప్‌ను చంపాలని తలచానన్న వెనిజులా జాతీయుడు

అరెస్టైన నిందితుడిని వెనిజులాకు చెందిన 26 ఏళ్ల రోనీ యోర్డ్రిక్స్ గ్యునిపా చ్రినోస్‌గా గుర్తించారు. తన తలలో వినిపించిన వింత శబ్దాలే వాషింగ్టన్ డిసికి వెళ్లి డొనాల్డ్ ట్రంప్‌ను హతమార్చాలని తనకు ఆదేశాలు ఇచ్చినట్లు అతను అధికారులకు చెప్పినట్లు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) వెల్లడించింది. అయితే ఈ వింత శబ్దాల ప్రస్తావన కోర్టులో దాఖలైన క్రిమినల్ కంప్లైంట్‌లో లేకపోవడం గమనార్హం.

అరెస్ట్ , కస్టడీ

నిందితుడు 2024 మార్చిలో టెక్సాస్ సరిహద్దు గుండా అమెరికాలోకి ప్రవేశించిన అక్రమ వలసదారుడని డిహెచ్‌ఎస్ తెలిపింది. ప్రస్తుతం యూఎస్ మార్షల్స్ సర్వీస్ అదుపులో ఉన్న అతనిపై దొంగిలించిన వాహనాన్ని అనధికారికంగా వాడటం, లైసెన్స్ లేకుండా ఆయుధాలు కలిగి ఉండటం వంటి పలు గన్‌మేకర్స్ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. శుక్రవారం డీసీ సుపీరియర్ కోర్టులో హాజరుపరచగా, అతనికి బెయిల్ నిరాకరిస్తూ జైలుకు తరలించారు. ఈ ఘటనతో వైట్‌హౌస్ పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ సీన్ కుర్రాన్ తెలిపారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.