Air India: ఇజ్రాయెల్‌కు విమాన సర్వీసులను రద్దు చేసిన ఎయిర్ ఇండియా

Air India: ఇజ్రాయేల్ నుంచి వివిధ దేశాలకు విమాన సర్వీసులు పునఃప్రారంభం అయినప్పటికీ, ఎయిర్ ఇండియా తన సర్వీసులను మే 31వ తేదీ వరకూ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది

KVD Varma
Published on: 6 April 2026 11:52 AM IST
Air India: ఇజ్రాయేల్ కు ఎయిర్ ఇండియా తన సర్వీసులను మే 31వ తేదీ వరకూ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది
X

Air India

Air India: ఇజ్రాయెల్ , అమెరికా , ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న వరుస దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీని కారణంగా , పలు భారతీయ విమానయాన సంస్థలు తమ విమాన సర్వీసులను మార్చుకున్నాయి. కొన్ని కంపెనీలు కొన్ని దేశాలకు విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేశాయి. ఈ కూర్మంలో ఎయిర్ ఇండియా ఒక నెల పాటు ఇజ్రాయెల్‌కు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది .

మధ్యప్రాచ్య యుద్ధం వల్ల విమానయాన సేవలు ప్రభావితం

ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న యుద్ధం అంతర్జాతీయ విమాన సేవలకు అంతరాయం కలిగించింది. ఈ పరిస్థితుల్లో, ఇజ్రాయెల్‌కు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను ఒక నెల పాటు నిలిపివేయనున్నట్లు వార్తలు వచ్చాయి. న్యూఢిల్లీ-టెల్ అవీవ్ మార్గంలో విమాన సర్వీసులను మే 31, 2026 వరకు నిలిపివేసినట్లు ఒక అధికారి తెలిపారు. ఈ విషయం ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారత ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

కఠినమైన ఆంక్షల నడుమ ఇజ్రాయెల్ విమాన సర్వీసులు

ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో, కఠినమైన ఆంక్షలు ఉన్నప్పటికీ విమాన సేవలను కొనసాగిస్తున్న ఏకైక దేశం ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో, ఎయిర్ ఇండియా ఇజ్రాయెల్‌కు తన విమాన సర్వీసులను నిలిపివేయడంతో, అక్కడ నివసిస్తున్న భారతీయులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. విమాన సర్వీసులు రద్దు కావడంతో, ఇజ్రాయెల్ విడిచి వెళ్లాలనుకునే భారతీయులు జోర్డాన్ లేదా ఈజిప్ట్ మీదుగా రోడ్డు మార్గంలో ప్రయాణించి, అక్కడి నుంచి భారతదేశానికి తిరిగి రావాల్సి వస్తోంది.

ఈ ప్రయాణానికి చాలా సమయం పట్టడమే కాకుండా, చాలా డబ్బు కూడా ఖర్చవుతుంది. ఇది ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయ ప్రజలలో తీవ్ర గందరగోళానికి కారణమవుతోంది.

ఇజ్రాయెల్‌లోని హైఫాలో 10 ప్రాంతాలపై ఇరాన్ దాడి..

ఇరాన్ ఉత్తర ఇజ్రాయెల్ నగరమైన హైఫాపై 10 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని మరోసారి క్షిపణి దాడి చేసింది. రిపోర్ట్స్ ప్రకారం, నగరంలోని వివిధ ప్రాంతాల్లో క్షిపణులు పడి, భవనాలు మరియు రహదారులకు నష్టం వాటిల్లింది. ఒక కారుకు కూడా నిప్పంటుకున్నట్లు సమాచారం. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు లేదా మరణించలేదు అని మొదట వార్తలు వచ్చేయి. అయితే, ఇజ్రాయెల్ నగరం హైఫాపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడి అనంతరం శిథిలాల నుంచి ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మరో ఇద్దరు ఇంకా గల్లంతయ్యారు, వారి కోసం గాలింపు కొనసాగుతోంది.

ఆదివారం సాయంత్రం జరిగిన దాడి నుంచి సహాయక బృందాలు శిథిలాల కింద గాలిస్తున్నాయి. అత్యధికంగా దెబ్బతిన్న అపార్ట్‌మెంట్‌లోనే గల్లంతైన వారు ఉన్నారని భావిస్తున్నారు. క్షిపణి భవనం కింది భాగాన్ని ఢీకొనడంతో, పైన ఉన్న ఫ్లాట్లు కూలిపోయి భారీ విధ్వంసం జరిగింది. సహాయక చర్యల సమయంలో, శిథిలాలలో క్షిపణికి చెందిన పేలని భాగాలు ఉండవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉండి ప్రమాదవశాత్తు పేలుడు సంభవిస్తే విధ్వంసం జరిగే ఛాన్స్ ఉందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

KVD Varma

KVD Varma

జర్నలిజం రంగంలో 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవం నాది. 2008లో సాక్షి పత్రికలో రిపోర్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి, ఆపై వివిధ పత్రికల్లో రిపోర్టర్ గా, బ్యూరో చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించాను. డిజిటల్ విప్లవంతో ఇటువైపు ప్రయాణంలో భాగంగా HMTVతో ప్రారంభించి TV9, RTV, Mahaa News వంటి అగ్రగామి సంస్థల్లో డిజిటల్ జర్నలిస్టుగా పనిచేశాను. ప్రస్తుతం HMTV వెబ్‌సైట్ వేదికగా పాఠకులకు తాజా వార్తలను అందిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ.. హిందీ, ఇంగ్లీష్ వార్తలను తెలుగు పాఠకుల అభిరుచికి అనుగుణంగా అనువదించి, విశ్లేషణాత్మక కథనాలను అందించడం నా ప్రత్యేకత.

Next Story