Nvidia CEO: చైనా గూఢచారితో వివాహేతర సంబంధం నిజమే..!

Nvidia CEO: చైనా గూఢచారితో తనకున్న వివాహేతర సంబంధాన్ని ఎన్వీడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ స్వయంగా అంగీకరించారు.

Gagan kumar
Published on: 9 Nov 2026 12:04 PM IST
Nvidia CEO
X

Nvidia CEO: చైనా గూఢచారితో వివాహేతర సంబంధం నిజమే..!

Jensen Huang: ప్రపంచ ఏఐ విప్లవానికి నాయకత్వం వహిస్తున్న ప్రముఖ టెక్ దిగ్గజం ఎన్వీడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ చుట్టూ ఇప్పుడు ఒక సంచలనాత్మక వివాదం చుట్టుముట్టింది. అంతర్జాతీయ మీడియాలో వెలువడుతున్న కథనాల ప్రకారం.. చైనా గూఢచారిగా అనుమానిస్తున్న ఒక మహిళతో తనకు వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆయన స్వయంగా అంగీకరించి, తన కుటుంబానికి ,కంపెనీ ఉద్యోగులకు అంతర్గత ఈ-మెయిల్ ద్వారా క్షమాపణలు పలికారు.

'ది న్యూయార్క్ టైమ్స్' ప్రచురించిన కథనం ప్రకారం, సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ డేటా సెంటర్ కంపెనీలో ఉన్నతాధికారిణిగా పనిచేసిన ఆలిస్ హువాంగ్‌పై అమెరికా నిఘా సంస్థలు కన్నువేశాయి. ఆమె చైనా తరఫున గూఢచర్యం చేస్తోందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆమె జెన్సెన్ హువాంగ్‌తో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరుచుకుని, ఎన్వీడియాకు చెందిన అత్యంత అధునాతన ఏఐ చిప్‌ల సమాచారాన్ని , రహస్య సాంకేతిక వివరాలను బీజింగ్‌కు చేరవేసిందనే ప్రచారం అంతర్జాతీయ రాజకీయ, సాంకేతిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ వ్యవహారం విపరీతంగా ప్రచారంలోకి రావడంతో జెన్సెన్ హువాంగ్ నిజాన్ని అంగీకరిస్తూ ఉద్యోగులకు ఒక భావోద్వేగ సందేశాన్ని పంపారు.నేను నా భార్యకు నమ్మకద్రోహం చేశాను. నా చర్యల వల్ల నా భార్య, పిల్లలు తీవ్రంగా మనస్తాపానికి గురయ్యారు. నేను చేసిన పనికి ఎలాంటి సమర్థన లేదు. మనస్ఫూర్తిగా అందరికీ క్షమాపణలు చెబుతున్నాను. నా కుటుంబం నాకు ఎల్లప్పుడూ కొండంత అండగా నిలిచింది, కానీ నేను వారి నమ్మకాన్ని వమ్ము చేశాను. ఈ తప్పుకు నేనే పూర్తి బాధ్యత వహిస్తున్నాను. దయచేసి నా కుటుంబానికి గోప్యత ఇవ్వాలని కోరుతున్నాను అని పశ్చాత్తాపడ్డారు.

న్యాయ నిపుణులు ,స్వతంత్ర డైరెక్టర్లతో ఒక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.ఇప్పటివరకు జరిగిన ప్రాథమిక పరిశీలనలో జాతీయ భద్రతకు గానీ, కంపెనీ టెక్నాలజీ రహస్యాలకు గానీ ఎలాంటి భంగం వాటిల్లలేదని బోర్డు స్పష్టం చేసింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పందిస్తూ.. ఇది కంపెనీకి సంబంధించిన అంతర్గత వ్యవహారమని పేర్కొన్నారు. ఈ దర్యాప్తునకు తాను పూర్తిస్థాయిలో సహకరిస్తానని, జాతీయ భద్రతకు కట్టుబడి ఉంటానని హువాంగ్ వెల్లడించారు.

ఈ క్లిష్ట సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జెన్సెన్ హువాంగ్‌కు మద్దతుగా నిలవడం విశేషం. జెన్సెన్ దేశం కోసం అద్భుతమైన సేవలు అందించారని, ఆయన చాలా మంచి వ్యక్తి అని ప్రశంసించారు. అంతేకాకుండా, త్వరలో తాను చేపట్టబోయే ఆసియా అధికారిక పర్యటనకు హువాంగ్‌ను కూడా తనతో పాటు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించి నిరసనకారులకు, విమర్శకులకు గట్టి సందేశమిచ్చారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఏఐ కంపెనీలలో ఒకటైన ఎన్వీడియా సారథి వ్యక్తిగత జీవితం , కంపెనీ భద్రత ఒకేసారి చర్చల్లోకి రావడం టెక్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. మరి ఈ వివాదం నుంచి జెన్సెన్ హువాంగ్‌ ఎలా బయటపడతారో చూడాలి.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.