Malkajgiri: మల్కాజిగిరి వినాయక మండపంలో ప్రత్యేక పూజలు చేసిన జోనల్ కమిషనర్!

Malkajgiri: మల్కాజిగిరిలో మహావీర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ప్రత్యేక పూజలు చేసిన జోనల్ కమిషనర్ సచ్చిత్ గగ్వార్, డిప్యూటీ కమిషనర్ జకియా సుల్తానా.

Bodike Manohar, Malkajgiri
Published on: 24 Sept 2026 7:53 PM IST
Malkajgiri
X

Malkajgiri: మల్కాజిగిరి వినాయక మండపంలో ప్రత్యేక పూజలు చేసిన జోనల్ కమిషనర్!

Malkajgiri: మల్కాజిగిరి డివిజన్‌లో మహావీర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంపత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి జోనల్ కమిషనర్ సచ్చిత్ గగ్వార్, డిప్యూటీ కమిషనర్ జకియా సుల్తానా హాజరై గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అధికారులను సత్కరించి, ఉత్సవ ఏర్పాట్లను వివరించారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri