Abdullapurmet: 'గోమాత – రాష్ట్రమాత' పార్టీ పేరుపై ఈసీఐ నిరాకరణ.. యుగ తులసి పార్టీ ఆగ్రహం!
Abdullapurmet: 'గోమాత – రాష్ట్రమాత పార్టీ' పేరుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించడంపై యుగ తులసి పార్టీ అధ్యక్షుడు కె. శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Abdullapurmet: 'గోమాత – రాష్ట్రమాత' పార్టీ పేరుపై ఈసీఐ నిరాకరణ.. యుగ తులసి పార్టీ ఆగ్రహం!
Abdullapurmet: "గోమాత – రాష్ట్రమాత పార్టీ" పేరుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) అనుమతి నిరాకరించడాన్ని యుగ తులసి పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని పార్టీ అధ్యక్షుడు కె. శివకుమార్ స్పష్టం చేశారు.
పార్టీ పేరును "గోమాత – రాష్ట్రమాత పార్టీ"గా మార్చుకునేందుకు ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29A(9) ప్రకారం దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. అయితే అక్టోబర్ 27, నవంబర్ 18 తేదీల్లో ఈసీఐ పంపిన లేఖల్లో ప్రతిపాదిత పేరు నిబంధనలకు అనుగుణంగా లేదని పేర్కొంటూ ప్రత్యామ్నాయంగా మూడు పేర్లు సూచించాలని కోరినట్లు వెల్లడించారు.
గోమాత – రాష్ట్రమాత అనే పేరు ఏ ఒక్క మతానికీ పరిమితం కాదని, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం, రైతుల సంక్షేమం, గ్రామీణ ఆర్థిక స్వావలంబన, దేశ సమగ్రతకు ప్రతీకగా ఈ పేరును ఎంచుకున్నామని శివకుమార్ పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 48, 51A(g), 19(1)(c) తమ పార్టీ ఆశయాలకు బలాన్నిస్తాయని తెలిపారు.
ఈసీఐ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించి, పార్టీ వాదనలు వినేందుకు వ్యక్తిగత విచారణకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయ పేర్లు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ, తమ ప్రతిపాదిత పేరుకు అనుమతి లభించే వరకు ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయపోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
కె. శివకుమార్, అధ్యక్షుడు, యుగ తులసి పార్టీ




