Gopanpally: గోపన్‌పల్లిలో కిడ్నాప్ కలకలం.. గంటల్లోనే ఛేదించిన పోలీసులు

Gopanpally: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపన్‌పల్లిలో ఇన్నోవా కారులో కిడ్నాప్‌నకు గురైన శ్యామ్ అనే యువకుడిని పోలీసులు గంటల వ్యవధిలోనే రక్షించారు.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 25 Oct 2026 10:09 PM IST
Gopanpally
X

Gopanpally: గోపన్‌పల్లిలో కిడ్నాప్ కలకలం.. గంటల్లోనే ఛేదించిన పోలీసులు

గచ్చిబౌలి: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపన్‌పల్లిలో ఓ యువకుడి కిడ్నాప్ ఉదంతం కలకలం రేపింది. అయితే పోలీసులు అప్రమత్తమై తక్షణమే చర్యలు చేపట్టడంతో కొద్ది గంటల్లోనే బాధితుడు సురక్షితంగా కుటుంబ సభ్యుల చెంతకు చేరాడు.

నగరానికి చెందిన పి. భార్గవ్ రాజ్ (ఐటీ ఉద్యోగి) తన పాఠశాల స్నేహితుడు పి. శ్యామ్‌తో కలిసి అక్టోబర్ 24న గోపన్‌పల్లిలోని 'వెస్ట్‌సైడ్ వైన్స్' పర్మిట్ రూమ్‌లో మద్యం సేవించారు. అనంతరం వారిద్దరూ భోజనం చేసేందుకు ఎన్‌టీఆర్ నగర్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా, ఎన్‌టీఆర్ నగర్ ఎక్స్‌ రోడ్డు వద్ద గుర్తుతెలియని వ్యక్తులు బూడిద రంగు ఇన్నోవా వాహనంలో వచ్చి శ్యామ్‌ను బలవంతంగా ఎక్కించుకుని తీసుకువెళ్లారు.

ఈ ఘటనతో దిగ్భ్రాంతికి గురైన భార్గవ్ రాజ్ వెంటనే 'డయల్ 112' కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన గచ్చిబౌలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. పోలీసుల చొరవతో కిడ్నాప్‌కు గురైన శ్యామ్‌ను పోలీసులు గుర్తించి, అతడిని సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY