Vikarabad: వికారాబాద్ జిల్లాలో యువకుడి అనుమానాస్పద మృతి.. కలకలం!

Vikarabad: రూప్‌ఖాన్‌పేట్ గ్రామానికి చెందిన యువకుడు ఎర్రోళ్ల సాయి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా విషాదం నింపింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

WAZID, PARIGI
Published on: 25 Oct 2026 10:11 AM IST
Vikarabad
X

Vikarabad: వికారాబాద్ జిల్లాలో యువకుడి అనుమానాస్పద మృతి.. కలకలం!

Vikarabad: వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూప్ ఖాన్ పెట్ గ్రామానికి చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.పరిగి మండలం రూప్‌ఖాన్‌పేట్ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల సాయి (24) మృతి చెందాడు.సోండేపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని మైనమ్మ చెరువు తండా సమీపంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

మామిడి చెట్టుకు ఉరేసుకున్న స్థితిలో సాయి మృతిచెందినట్లు సమాచారం.కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.

అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అయితే, యువకుడి మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.యువకుడి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

WAZID, PARIGI

WAZID, PARIGI