LB Nagar: టెలిగ్రామ్ ఆన్‌లైన్ టాస్క్ పేరుతో మోసం.. రూ.1.13 లక్షలు స్వాహా!

LB Nagar: టెలిగ్రామ్‌లో ఆన్‌లైన్ టాస్క్, ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో నిరుద్యోగ యువకుడి నుంచి రూ.1.13 లక్షలు కాజేసిన ఘటనపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 6 Oct 2026 8:15 PM IST
LB Nagar
X

LB Nagar: టెలిగ్రామ్ ఆన్‌లైన్ టాస్క్ పేరుతో మోసం.. రూ.1.13 లక్షలు స్వాహా!

ఎల్బీనగర్: ఆన్‌లైన్ టాస్క్, పెట్టుబడి పేరుతో యువకుడిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. టెలిగ్రామ్ ద్వారా పరిచయమైన వ్యక్తులు అధిక లాభాలు వస్తాయని నమ్మించి బాధితుడి నుంచి విడతల వారీగా రూ.1,13,450 బదిలీ చేయించుకున్నారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం నర్సాపురం గ్రామానికి చెందిన మాలోతు నవీన్ (27) పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు.

సెప్టెంబర్ 26/27న “Arjun Patel LT C01” పేరుతో ఉన్న టెలిగ్రామ్ ఛానల్/వ్యక్తి నుంచి నవీన్‌కు సందేశం వచ్చింది. ఆన్‌లైన్ టాస్క్, పెట్టుబడి పథకం పేరుతో అధిక రాబడి వస్తుందని నమ్మించారు. వారి మాటలు నమ్మిన నవీన్.. పలు లావాదేవీల ద్వారా మొత్తం రూ.1,13,450 చెల్లించాడు.

అనంతరం పెట్టుబడి మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే అవకాశం లేకపోవడంతో అనుమానం వచ్చింది. డబ్బు తిరిగి ఇవ్వాలని కోరినా అవతలి వ్యక్తులు స్పందించలేదు. తాను సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించిన నవీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ ఘటనపై Cr.No.1315/2026గా కేసు నమోదు చేశారు. BNS 318(4), 319(2), IT Act 66(C), 66(D) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR