Medak: ర్యాక్ గోల్డ్ పార్క్‌లో చెత్తను తొలగించిన పాలకవర్గం, యువత!

Medak: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 429వ స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. ర్యాక్ గోల్డ్ పార్క్‌లోని చెత్తను పాలకవర్గం, యువత తొలగించారు.

RAJU,TOOPRAN
Published on: 29 Nov 2026 11:39 AM IST
Medak
X

Medak: ర్యాక్ గోల్డ్ పార్క్‌లో చెత్తను తొలగించిన పాలకవర్గం, యువత!

Medak: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఆదర్శ గ్రామం మల్కాపూర్‌లో 429వ ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ ఆదివారం ర్యాక్ గోల్డ్ పార్క్‌లో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని గ్రామ పాలకవర్గం, యువత కలిసి తొలగించారని గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ తెలిపారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యానికి పునాది అని, ప్రతి ఆదివారం నిర్విరామంగా కొనసాగుతున్న ఈ స్వచ్ఛతా కార్యక్రమంలో గ్రామస్తులందరూ భాగస్వాములు కావాలని కోరారు. మల్కాపూర్‌ను ఆదర్శ గ్రామంగా నిలపడానికి పరిశుభ్రతే ప్రధాన ఆయుధమని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, యువత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RAJU,TOOPRAN

RAJU,TOOPRAN