Vikarabad: పెన్నార్ ఇండస్ట్రీస్ గేటు ముందు కనీస వేతనాల కోసం కార్మికుల ధర్నా!

Vikarabad: మోమిన్‌పేట్ మండలంలోని పెన్నార్ ఇండస్ట్రీస్ కంపెనీ గేటు ముందు కనీస వేతనాలు, బోనస్, ఐడీ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కార్మికులు వంటావార్పుతో ధర్నా చేపట్టారు.

MOGULAIAH, VIKARABAD
Published on: 24 Nov 2026 12:40 PM IST
Vikarabad
X

Vikarabad: పెన్నార్ ఇండస్ట్రీస్ గేటు ముందు కనీస వేతనాల కోసం కార్మికుల ధర్నా!

Vikarabad: మోమిన్‌పేట్ మండలం వెల్చల్, మొరంగపల్లి గ్రామాల శివారులో ఉన్న పెన్నార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళనకు దిగారు. కంపెనీ ప్రధాన గేటు ముందు ధర్నా నిర్వహిస్తూ తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ కంపెనీలో పనిచేస్తున్న తమకు కనీస వేతనాలు చెల్లించడం లేదని, అర్హులైన కార్మికులకు బోనస్‌లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కనీసం కార్మికులుగా గుర్తింపు కల్పించే ఐడీ కార్డులు కూడా ఇవ్వడం లేదని, విధులకు అవసరమైన యూనిఫామ్‌లు సైతం అందించడం లేదని ఆరోపించారు. కంపెనీ ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు పదేళ్లకు పైగా పనిచేస్తున్న కార్మికులకు ఇప్పటికీ ఆశించిన స్థాయిలో వేతనాలు పెంచడం లేదని వాపోయారు.

ఎన్నో సంవత్సరాలుగా కంపెనీ అభివృద్ధిలో భాగస్వాములవుతున్నప్పటికీ తమకు సరైన వేతనాలు, కార్మిక హక్కులు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేస్తూ కంపెనీకి వెళ్లే ప్రధాన రహదారిపై వంటావార్పు కార్యక్రమం చేపట్టారు.

రాత్రింబవళ్లు ధర్నా కొనసాగిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల సమస్యలపై కంపెనీ యాజమాన్యం వెంటనే స్పందించి కనీస వేతనాలు, బోనస్‌లు, గుర్తింపు కార్డులు, యూనిఫామ్‌లు కల్పించడంతో పాటు వేతనాల పెంపుపై తగిన నిర్ణయం తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

కంపెనీ నుంచి వెలువడే వ్యర్ధాలు పొల్యూషన్ ద్వారా చుట్టుపక్కల పంట పొలాలలో పంటకు కూడా తీవ్ర నష్టం జరుగుతుందని గ్రామస్తులు ఆగ్రాహం వ్యక్తం చేస్తున్నారు.

వెంటనే కార్మిక శాఖ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ గారిని పట్టించుకోని కంపెనీపై తగు చర్యలు తీసుకొని కార్మీకులకు వెంటనే న్యాయం చేయాలని కోరుతున్నారు. కార్మికుల న్యాయపరమైన డిమాండ్లకు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా మద్దతు పలుకుతున్నారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD