Hayathnagar: పెద్ద అంబర్‌పేట్‌లో మట్టి వినాయకుడికి కుంకుమార్చన!

Hayathnagar: హయత్ నగర్ పెద్ద అంబర్‌పేట్‌లో మట్టి వినాయకుడికి మహిళల ఘన కుంకుమార్చన.. పర్యావరణ పరిరక్షణే లక్ష్యమన్న సంక్షేమ సంఘం సభ్యులు.

AJAY, HAYATH NAGAR
Published on: 18 Sept 2026 1:04 PM IST
Hayathnagar
X

Hayathnagar: పెద్ద అంబర్‌పేట్‌లో మట్టి వినాయకుడికి కుంకుమార్చన!

Hayathnagar: లక్ష్మారెడ్డిపాలెంలోని సూర్యవంశీ గార్డెన్స్ కాలనీలో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మహిళలతో కుంకుమార్చన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా పీవోపీ విగ్రహాలకు బదులుగా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించినట్లు సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించాలని వారు కోరారు. కార్యక్రమంలో కాలనీ మహిళలు, సంక్షేమ సంఘం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR