LB Nagar: పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరిట కొత్తపేట మహిళకు రూ.10.39 లక్షల సైబర్ టోకరా!
LB Nagar: ఎల్బీనగర్ కొత్తపేట మహిళకు పార్ట్‌టైమ్ ఉద్యోగ పేరుతో సైబర్ టోకరా. మ్యాప్స్‌లో రేటింగ్స్ ఇస్తే లాభం అంటూ నమ్మించి రూ.10.39 లక్షలు కొట్టేసిన మోసగాళ్లు.
LB Nagar: పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరిట కొత్తపేట మహిళకు రూ.10.39 లక్షల సైబర్ టోకరా!
LB Nagar: పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ మహిళకు రూ.10.39 లక్షలు టోకరా వేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ప్రకటనను నమ్మి పెట్టుబడులు పెట్టిన బాధితురాలు చివరకు మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించింది.
కొత్తపేటకు చెందిన శ్రావణి ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. ఈ నెల 14న ఇన్‌స్టాగ్రామ్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగ ప్రకటన చూసి క్లిక్ చేసింది. మనస్విని పేరుతో ఓ యువతి ఆమెకు పరిచయమై గూగుల్ మ్యాప్స్‌లో రెస్టారెంట్లకు రేటింగ్స్ ఇవ్వడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చని నమ్మించింది. రోజుకు రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు ఆదాయం వస్తుందని ఆశ చూపింది.
అనంతరం శ్రేయ పేరుతో మరో యువతి పరిచయమై ఓ గ్రూపులో చేర్చుకుంది. పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మబలికింది. దీంతో బాధితురాలు వారు సూచించిన ఖాతాల్లో పలు విడతలుగా రూ.10.39 లక్షలు జమ చేసింది. ఆ తర్వాత మోసపోయినట్లు గుర్తించి మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




