Chevella: చేవెళ్ల మీర్జాగూడ వద్ద మహిళపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి!

Chevella: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద ఓ మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని 108లో ఆసుపత్రికి తరలించారు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 12 Oct 2026 11:43 AM IST
Chevella
X

Chevella: చేవెళ్ల మీర్జాగూడ వద్ద మహిళపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి!

Chevella: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని మీర్జాగూడ గేటు సమీపంలో మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి. అర్ధరాత్రి సమయంలో వరంగల్ ప్రాంతానికి చెందిన 35 సంవత్సరాల మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి వదిలేసి పోయారు. మీర్జాగూడ గ్రామానికి చెందిన కొందరు రైతులు పొలానికి వెళ్లే క్రమంలో అక్కడ మహిళలను చూసి 108 నెంబర్ కు ఫోన్ చేసి ఆంబులెన్స్ రప్పించి ప్రధమ చికిత్స చేసి అంబులెన్స్ లో ప్రభుత్వా హాస్పిటల్ కు తరలించారు.

అలాగే స్థానిక పోలీసుల కూడా ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మహిళను వివరాలు అడగగా తను వరంగల్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా మాత్రమే తెలిపిందని స్థానికులైతే తెలుపుతున్నాను. ఎవరో తనని తెల్ల కారులో తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత కత్తితో తలపై పొడిచినట్టు తెలుపుతుంది.

మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ నెంబర్ ఇవ్వు వాళ్లకి ఫోన్ చేస్తామంటే వద్దు వద్దు అని భయపడుతుందని స్థానికులు తెలుపుతున్నారు. రాత్రి నుంచి అక్కడే గాయలతో పడి ఉండడంతో స్థానికులు అంబు లెన్స్ లో హాస్పిటల్ కి తరలించారు. ఇంక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA