Hyderabad: శాసనమండలిలో పట్టభద్రుల గొంతుకనవుతా: డా. నల్లమాసు కృష్ణ గౌడ్

Hyderabad: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు హైకోర్టు న్యాయవాది డా. నల్లమాసు కృష్ణ గౌడ్ ప్రకటించారు.

RAJESH,	WEST ZONE
Published on: 6 Nov 2026 7:44 PM IST
Hyderabad
X

Hyderabad: శాసనమండలిలో పట్టభద్రుల గొంతుకనవుతా: డా. నల్లమాసు కృష్ణ గౌడ్

Hyderabad: వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు ప్రజా ఉద్యమకారుడు, హైకోర్టు న్యాయవాది డా. నల్లమాసు కృష్ణ గౌడ్ ప్రకటించారు. శుక్రవారం ఉదయం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద విద్యార్థులు, యువజనులతో కలిసి ర్యాలీగా బయలుదేరి గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడారు.

గత 30 ఏళ్లుగా ప్రజాక్షేత్రంలో, కోర్టుల్లో ప్రజల పక్షాన పోరాడుతున్నా. శాసనమండలిలో పట్టభద్రులు, నిరుద్యోగులు, పీడిత వర్గాల గొంతుకగా నిలుస్తా" అని ఆయన స్పష్టం చేశారు. తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజా, విద్యార్థి, న్యాయవాద, బహుజన సంఘాల ఐక్యవేదిక విజ్ఞప్తి చేసింది.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE