Tandur: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ప్రారంభం వేళ కౌన్సిలర్ అరెస్టు!
Tandur: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని 8వ వార్డులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ప్రారంభోత్సవానికి రాకుండా తనను హౌస్ అరెస్టు చేశారని బీఆర్ఎస్ కౌన్సిలర్ జావీద్ ఆరోపించారు.
Tandur: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ప్రారంభం వేళ కౌన్సిలర్ అరెస్టు!
తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ పరిధిలోని 8 వార్డులో సబ్ రిజిస్టర్ కార్యాలయ ప్రారంభోత్సవానికి వార్డు కౌన్సిలర్ అయిన తనని రాకుండా హౌస్ అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని వార్డు బిఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ అన్నారు.
బిఆర్ఎస్ కౌన్సిలర్ జావీద్ మీడియా తో మాట్లాడుతూ... రాష్ట్రం తో పాటు నియోజకవర్గంలో దుర్మార్గపు పాలన నడుస్తుందన్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయ ప్రారంభోత్సవ శిలాఫలకంలో తన పేరు ఉన్నప్పటికీ తాను రాకుండా పోలీసులచే హౌస్ అరెస్టు చేయించి ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో తానను పాల్గొనకుండా అరెస్టు చేశారన్నారు.
తాను వస్తే కాంగ్రెస్ చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తానని భయం వల్ల హౌస్ అరెస్ట్ చేశారన్నారు. కాంగ్రెస్ ఎలక్షన్ సమయంలో ఇచ్చిన గ్యారెంటీలు హామీలు ఇంతవరకు అమలు చేయలేదన్నారు. వాటిని ప్రశ్నిస్తామన్న భయంతో తాను కార్యక్రమానికి రాకుండా ముందస్తు హౌస్ అరెస్టు చేయడం జరిగిందన్నారు. పోలీసులు బిఆర్ఎస్ కౌన్సిలర్ జావీద్ ను పోలీస్ స్టేషన్ కి తరలించారు.




