Tandur: తాండూరులో 250 మందికి ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ!

Tandur: తాండూరులో బీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 250 మంది ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఉచిత మెటీరియల్ పంపిణీ చేశారు.

Srikanth Reddy, Tandur
Published on: 28 Oct 2026 11:07 PM IST
Tandur
X

Tandur: తాండూరులో 250 మందికి ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ!

తాండూరు: తాండూరు పట్టణంలోని విలియం మూన్ స్కూల్లో BMR ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోటీ పరీక్ష (ఎస్ఐ, కానిస్టేబుల్)లకు సిద్ధమవుతున్న దాదాపు 250 మంది అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ ను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ దీపక్ తివారి , ఎస్పీ స్నేహ మెహ్రా లతో కలిసి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ మీ అభిమాన నాయకుడు తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్, స్టడీ మెటీరియల్ అందిస్తున్న BMR ఫౌండేషన్ సేవలను అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అభ్యర్థులు మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ లక్ష్యంపై దృష్టి సారించాలని సూచించారు. క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని పిలుపునిచ్చారు. అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ టెస్టులు, ఫైనల్ పరీక్షలకు కూడా కోచింగ్ అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur