Vikarabad: లబ్ధిదారులకు చేయూత పెన్షన్ పత్రాలు పంపిణీ చేసిన స్పీకర్
Vikarabad: వికారాబాద్ జిల్లా కోట్పల్లిలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేయూత పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ చేసి, మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
Vikarabad: లబ్ధిదారులకు చేయూత పెన్షన్ పత్రాలు పంపిణీ చేసిన స్పీకర్
వికారాబాద్: వికారాబాద్ నియోజకవర్గంలోని కోట్పల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ శాసనసభ స్పీకర్, వికారాబాద్ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు హాజరయ్యారు. కోట్పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా స్పీకర్ గారు మాట్లాడుతూ...
ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలను లక్షాధికారులను చేయాలనే లక్ష్యంతో అనేక పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. నేడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో వివిధ పథకాలను అమలు చేస్తున్నారు.
ఇప్పటికే చాలా పథకాలు మహిళల పేరిటనే అమలు చేస్తున్నారు. మహిళా సంఘాలకు పెట్రోల్ బంకుల నిర్వహణ బాధ్యతలు, ఆర్టీసీ సొంత బస్సులు, ఆర్టీసీ అద్దె బస్సులు ఇప్పించడం, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయించడం వంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా మహిళల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు.
గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిరోజూ 18 గంటలు కష్టపడుతున్నారు. ఇదంతా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి రాగానే పార్టీలకు అతీతంగా రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేశారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారు.
నేడు బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గానీ, హరీష్ రావు గానీ అబద్ధాలే చెబుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు, అసత్య ప్రచారం చేస్తున్నారు. పదేళ్ల పరిపాలనలో ఏమీ చేయకుండానే, మూడేళ్ల ప్రభుత్వ పరిపాలనపై విమర్శలు చేయడం చాలా బాధాకరం.
వికారాబాద్ తో పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి గారు పార్టీలకు అతీతంగా పనులు చేపడుతున్నారు. ప్రజల ఆశీస్సులు గౌరవ ముఖ్యమంత్రి గారిపై, మాపై ఉండాలి. వచ్చే ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండాలి.
ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం కనిపిస్తోంది. అందువల్ల కరువు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ నీళ్లను పొదుపుగా వాడాలి, కరెంటును కూడా పొదుపుగా వాడాలి. రైతులందరూ వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలి. ప్రజా ప్రభుత్వం ఇచ్చే సూచనలను తప్పకుండా పాటించాలి.
ఈ కార్యక్రమానికి హాజరైన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు మాట్లాడుతూ...
పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు అందిస్తోంది, అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతోంది. నేడు రాష్ట్రంలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. గత ప్రభుత్వం ఇవ్వని పెన్షన్లను కూడా ఈరోజు ప్రజా ప్రభుత్వం అర్హులందరికీ ఇస్తోంది. రేషన్ కార్డులు కూడా మంజూరు చేస్తోంది.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అనితాబాయి, సర్పంచుల సంఘం మండల ప్రెసిడెంట్ డాక నీలమ్మ, ఎంఆర్ఓ ఆనందరావు, ఎంపీడీఓ హేమంత్, కోట్పల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మండలంలోని సర్పంచులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




