Vikarabad: మోమిన్ పేట్‌లో చేయూత పెన్షన్ పత్రాలు పంపిణీ

Vikarabad: వికారాబాద్ నియోజకవర్గం మోమిన్ పేట్ మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేయూత పెన్షన్ పత్రాలు పంపిణీ చేశారు.

MOGULAIAH, VIKARABAD
Published on: 16 Nov 2026 4:21 PM IST
Vikarabad
X

Vikarabad: మోమిన్ పేట్‌లో చేయూత పెన్షన్ పత్రాలు పంపిణీ

వికారాబాద్: వికారాబాద్ నియోజకవర్గం మోమిన్ పేట్ మండల కేంద్రంలోని ఎం.పి.డి.ఓ కార్యాలయంలో నిర్వహించిన చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ శాసనసభ స్పీకర్, వికారాబాద్ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు హాజరయ్యారు. మోమిన్ పెట్ మండల్ ప్రెసిడెంట్ శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా స్పీకర్ గారు మాట్లాడుతూ... తెలంగాణలో ప్రజా ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. సంకల్పం కూడా. ఈ విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేయడం లేదు.

గత ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ పథకాలను కూడా ఈ ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉంది. మరిన్ని కొత్త పథకాలను జోడిస్తూ ముందుకు వెళ్తోంది.

ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ప్రభుత్వం ఎక్కడా అభివృద్ధి కార్యక్రమాలను ఆపడం లేదు. సంక్షేమ పథకాలను కూడా ఆపడం లేదు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమానంగా బ్యాలెన్స్ చేస్తూ.. ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. అన్ని వర్గాల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తోంది.

ఇక మహిళల సంక్షేమం కోసం మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. విద్యార్థుల చదువు కోసం, రైతుల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి పథకాలను అమలు చేస్తోంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల కోసం రోజుకు సుమారు 18 గంటలు కష్టపడుతున్నారు. ప్రజల సంక్షేమమే ఆయన లక్ష్యం.

రేషన్ కార్డులు, రైతు బీమా ఇస్తున్నాం. పాత పథకాలను కూడా అమలు చేస్తున్నాం. కొత్త రోడ్లు వేస్తున్నాం. మన నియోజకవర్గానికి ఇప్పటివరకు 1000 కోట్లు వచ్చాయి. త్వరలోనే శంకుస్థాపన చేస్తాం. 5 కోట్లు మోమిన్ పేట్ రోడ్ల అభివృద్ధి కోసం ఇస్తాం.

ఈ కార్యక్రమంలో మోమిన్ పేట్ మండల సర్పంచులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు, స్థానికులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD