Vikarabad: వికారాబాద్‌లో ఐసీజేఎస్ సీసీటీఎన్ఎస్ పెండెన్సీపై ఎస్పీ సమీక్ష

Vikarabad: వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్రా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ICJS CCTNS పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతిపై సమీక్ష. కేసులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశం.

MOGULAIAH, VIKARABAD
Updated on: 7 Oct 2026 1:49 PM IST
Vikarabad
X

Vikarabad: వికారాబాద్‌లో ఐసీజేఎస్ సీసీటీఎన్ఎస్ పెండెన్సీపై ఎస్పీ సమీక్ష

Vikarabad: వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖ పరిధిలో కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, కోర్టు సంబంధిత ప్రక్రియలు, ICJS, CCTNS తదితర డిజిటల్ వ్యవస్థల్లో పెండింగ్ అంశాలపై జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాలోని సంబంధిత DSPలు, CIలు, SHOలు పాల్గొని కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ నివేదికలు, కోర్టు ప్రక్రియలు, డిజిటల్ రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు.

ప్రధానంగా ICJS ద్వారా కోర్టుల నుంచి e-Summons స్వీకరించడం, CCTNSలో కేసుల వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించడం, BNS కేసులను నిర్దేశిత 60/90 రోజుల గడువులోగా పరిష్కరించడం, ITSSO కేసుల్లో 60 రోజుల్లోగా ఛార్జ్‌షీట్ దాఖలు చేయడం తదితర అంశాలను ఎస్పీ గారు సమీక్షించారు.

పెండింగ్‌లో ఉన్న కేసులు, నివేదికలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, దర్యాప్తులో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారు అధికారులను ఆదేశించారు. అలాగే ICJS, CCTNS, ITSSO తదితర డిజిటల్ వ్యవస్థల్లో కేసులకు సంబంధించిన వివరాలను ఖచ్చితంగా, ఎప్పటికప్పుడు నమోదు చేసి నవీకరించాలని సూచించారు.

కేసుల దర్యాప్తులో నాణ్యతను పెంచడంతో పాటు పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, కోర్టు సంబంధిత ప్రక్రియలను సకాలంలో పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారు స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో DCRB DSP జనయ్య, AR DSP వీరేశం, IT Cell SI శంకర్ మరియు IT Cell సిబ్బంది, తదితరులు పాల్గొనడం జరిగింది.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD