Vikarabad: రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజా రక్షణే ధ్యేయంగా పనిచేయాలి!
Vikarabad: పోలీస్ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎస్పీ స్నేహ మెహ్రా. సెప్టెంబర్ 17 చారిత్రక ప్రాముఖ్యతను గుర్తుచేసిన ఎస్పీ.
Vikarabad: రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజా రక్షణే ధ్యేయంగా పనిచేయాలి!
Vikarabad: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయం పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS పోలీసు అధికారులు, సిబ్బందికి మరియు జిల్లా ప్రజలందరికీ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, హైదరాబాద్ సంస్థానం నిజాం పాలనలో కొనసాగిందని ఎస్పీ గుర్తు చేశారు.
అనంతరం హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసే ప్రక్రియలో భాగంగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పోలో అనంతరం, 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం అయిన చారిత్రక ఘట్టాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.ఈ చారిత్రక సందర్భం ప్రజాస్వామ్య పాలనకు సంబంధించిన ముఖ్యమైన ఘట్టంగా గుర్తించబడుతుందని పేర్కొంటూ, ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలను అందించేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ సూచించారు.
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని, ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించే విధంగా పారదర్శకత, బాధ్యతాయుతమైన విధానంతో విధులు నిర్వహించాలని, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ గారు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీ రాజేష్ మీనా, IPS గారు, వికారాబాద్ డీఎస్పీ అంజయ్య గారు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




