Vikarabad: ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఘనంగా ఆయుధ పూజ ఎస్పీ స్నేహ మెహ్రా

Vikarabad: వికారాబాద్ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆయుధ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ స్నేహ మెహ్రా. ఆయుధాలు, పోలీస్ వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహణ.

MOGULAIAH, VIKARABAD
Published on: 19 Oct 2026 4:20 PM IST
Vikarabad
X

Vikarabad: ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఘనంగా ఆయుధ పూజ ఎస్పీ స్నేహ మెహ్రా

వికారాబాద్: వికారాబాద్ జిల్లా పోలీస్ ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన ఆయుధ పూజా కార్యక్రమంలో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లోని బెల్ ఆఫ్ ఆర్మ్స్‌లో భద్రపరిచిన ఆయుధాలు, మందుగుండు సామగ్రి, అలాగే మోటార్ ట్రాన్స్‌పోర్ట్ (ఎంటీ) సెక్షన్‌లోని పోలీస్ వాహనాలకు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ శాఖలో ఆయుధ పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని పేర్కొన్నారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో ఆయుధాలు, పోలీస్ వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. విధి నిర్వహణలో ఉపయోగించే ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అత్యంత జాగ్రత్తగా భద్రపరచాలని, నిర్దేశించిన భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు.

అలాగే పోలీస్ వాహనాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ, వాటి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అత్యవసర సమయాల్లో ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేందుకు వాహనాలను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. పోలీస్ సిబ్బంది క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.

ఆయుధ పూజా కార్యక్రమం సందర్భంగా పోలీస్ శాఖలో సంప్రదాయాలకు గౌరవం, విధి నిర్వహణ పట్ల బాధ్యత, భద్రతా ప్రమాణాల ప్రాధాన్యతను ఎస్పీ గారు గుర్తుచేశారు. ఈ కార్యక్రమం పోలీస్ శాఖలో ఐక్యత, క్రమశిక్షణ, సేవా స్ఫూర్తిని ప్రతిబింబించింది.

ఇట్టి కార్యక్రమం లో జిల్లా అదనపు ఎస్పీ శ్రీ రాజేశ్ మీనా, ఐ‌పి‌ఎస్, ఏ‌ఆర్ డి‌ఎస్‌పి వీరేష్, ఆర్‌ఐ లు నాగరాజు, శ్రీశైలం, అశోక్ , ఆర్‌ఐ లు ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD