Vikarabad: మహిళలు, బాలల భద్రతకు అత్యంత ప్రాధాన్యత – ఎస్పీ స్నేహ మెహ్రా
Vikarabad: వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్రా ఆధ్వర్యంలో మహిళా భద్రతా విభాగంపై సమీక్ష. మహిళలు, బాలల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం.
Vikarabad: మహిళలు, బాలల భద్రతకు అత్యంత ప్రాధాన్యత – ఎస్పీ స్నేహ మెహ్రా
వికారాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో జిల్లా మహిళా భద్రతా విభాగం (District Women Safety Wing – DWSW) ఏర్పాటు, పనితీరు, భరోసా కేంద్రాల నిర్వహణ, ఆర్థిక అంశాలు, ITSSO పోర్టల్లో పెండింగ్ కేసులు తదితర అంశాలపై బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్ గారు పాల్గొన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో మహిళలు, బాలలపై జరిగే నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం అందించడం, మహిళా భద్రతా విభాగం పరిధిలోని వివిధ మాడ్యూళ్ల పనితీరు, భరోసా కేంద్రాల సేవలు, లైంగిక నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల పరిష్కారం వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు.
అనంతరం జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ మహిళలు, బాలల భద్రత పోలీస్ శాఖకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, మహిళలపై నేరాలను అరికట్టడంతో పాటు బాధితులకు తక్షణ సహాయం, న్యాయపరమైన మద్దతు, కౌన్సెలింగ్ అందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ సూచించారు.
జిల్లా మహిళా భద్రతా విభాగం పరిధిలోని అన్ని విభాగాలు సమర్థవంతంగా పనిచేయాలని, మహిళలు మరియు బాలలకు సంబంధించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, చట్టప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. మహిళలపై జరిగే నేరాలకు సంబంధించిన ఫిర్యాదుల విషయంలో నిర్లక్ష్యం వహించకుండా, నేర స్వభావాన్ని బట్టి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
లైంగిక నేరాలు, పోక్సో కేసుల్లో బాధితులకు అవసరమైన వైద్య, న్యాయ, కౌన్సెలింగ్ సహాయం అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. బాధితులు ఇబ్బందులకు గురికాకుండా, వారి గోప్యతను కాపాడుతూ, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.మహిళలు, బాలలపై జరిగే నేరాలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తును నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, ITSSO పోర్టల్లో కేసుల వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు. కేసుల దర్యాప్తులో జాప్యానికి కారణాలను సమీక్షిస్తూ, పెండింగ్ కేసుల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని తెలిపారు.
SHE Teams, భరోసా కేంద్రాలు, మహిళా పోలీస్ స్టేషన్లు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU), మిస్సింగ్ పర్సన్స్ మానిటరింగ్ సెల్ తదితర విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు. మహిళలు, బాలలకు సంబంధించిన ఫిర్యాదులు, అదృశ్యమైన వ్యక్తుల కేసులు, మానవ అక్రమ రవాణా అనుమానిత ఘటనలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. మహిళా భద్రతా విభాగం పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రతి విభాగానికి సంబంధించిన కేసులు, పురోగతి, పెండింగ్ అంశాలపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. సంబంధిత రికార్డులు, పోర్టల్లోని వివరాలు సక్రమంగా నిర్వహిస్తూ, ఉన్నతాధికారులు జారీ చేసే ఆదేశాలను గడువులోగా అమలు చేయాలని తెలిపారు.
ఇట్టి కార్యక్రమం లో జిల్లా అదనపు శ్రీ రాజేశ్ మీనా,ఐపిఎస్, డిసిఆర్బి డిఎస్పి జనయ్య, ఏహెచ్టియూ ఇన్స్పెక్టర్ అన్వర్ పాషా, భరోసా ఇన్స్పెక్టర్ ప్రమీల, ఎస్ఐ లు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.




