Vikarabad: ప్రజల ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలి జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర

Vikarabad: వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఎస్పీ స్నేహ మెహ్ర ప్రజల ఫిర్యాదులు స్వీకరించి సత్వర పరిష్కారానికి ఆదేశించారు.

MOGULAIAH, VIKARABAD
Published on: 16 Nov 2026 3:52 PM IST
Vikarabad
X

Vikarabad: ప్రజల ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలి జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర

వికారాబాద్: వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, ఐపీఎస్ ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వయంగా స్వీకరించారు.

వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల ఫిర్యాదులను పరిశీలించి, సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపి, చట్టపరిధిలో బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటికి సత్వర పరిష్కారం చూపించడమే ప్రజావాణి కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడైనా పోలీస్ కార్యాలయానికి రావచ్చని, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి పోలీస్ అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ సూచించారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD