Vikarabad: శివారెడ్డిపేట్ పీఏసీఎస్ చైర్మన్‌గా రాజశేఖర్ రెడ్డి!

Vikarabad: వికారాబాద్ మండలం శివారెడ్డిపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (PACS) చైర్మన్‌గా రాజశేఖర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించగా, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అభినందించారు.

MOGULAIAH, VIKARABAD
Published on: 11 Nov 2026 9:16 PM IST
Vikarabad
X

Vikarabad: శివారెడ్డిపేట్ పీఏసీఎస్ చైర్మన్‌గా రాజశేఖర్ రెడ్డి!

వికారాబాద్: వికారాబాద్ మండల పరిధిలోని శివారెడ్డిపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (PACS) చైర్మన్‌గా రాజశేఖర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హాజరయ్యారు.

నూతనంగా చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన రాజశేఖర్ రెడ్డిని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సంక్షేమం, సహకార సంఘం అభివృద్ధికి కృషి చేస్తూ రైతులకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సహకార సంఘం అధికారులు, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD