Vikarabad: మోమిన్‌పేట్ పోలీస్ స్టేషన్ ముందు సర్పంచ్, మహిళల ధర్నా

Vikarabad: వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ పోలీస్ స్టేషన్ ముందు కోల్కొంద సర్పంచ్ కరణం కీర్తి రామకృష్ణ, మహిళా ప్రజాప్రతినిధులు సీఐ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ధర్నా.

MOGULAIAH, VIKARABAD
Published on: 13 Nov 2026 1:00 PM IST
Vikarabad
X

Vikarabad: మోమిన్‌పేట్ పోలీస్ స్టేషన్ ముందు సర్పంచ్, మహిళల ధర్నా

వికారాబాద్: వికారాబాద్ జిల్లా, మోమిన్‌పేట్ కోల్కొంద గ్రామ ఉపసర్పంచ్ మహేందర్ రెడ్డిని మోమిన్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ఎస్సై, సీఐ దుర్భాషలాడారని ఆరోపిస్తూ గ్రామ సర్పంచ్ కరణం కీర్తి రామకృష్ణ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. ఈ ఘటనపై ప్రశ్నించేందుకు తెలంగాణ సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి, కోల్కొంద గ్రామ సర్పంచ్ కరణం కీర్తి రామకృష్ణతో పాటు వార్డు సభ్యులు, మహిళా ప్రజాప్రతినిధులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.

ఈ సందర్భంగా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకట్ మహిళా ప్రజాప్రతినిధులని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోవాలని బెదిరించారని వారు ఆరోపించారు. అంతేకాకుండా మహిళలను అసభ్య పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళా ప్రజాప్రతినిధులను దూషించిన సీఐ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ మహిళలు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD