Parigi: పరిగి కొడంగల్ చౌరస్తాలో డీసీఎం బోల్తా.. ముగ్గురికి గాయాలు!
Parigi: పరిగి కొడంగల్ చౌరస్తా వద్ద డీసీఎం వాహనం బోల్తా పడింది. సీఎం రేవంత్ రెడ్డి సభకు స్టేజ్ సామగ్రి తీసుకెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి.
Parigi: పరిగి కొడంగల్ చౌరస్తాలో డీసీఎం బోల్తా.. ముగ్గురికి గాయాలు!
Parigi: వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని కొడంగల్ చౌరస్తా టర్నింగ్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్న కార్యక్రమానికి సంబంధించి స్టేజ్ సామగ్రిని తీసుకెళ్తున్న డీసీఎం వాహనం టర్నింగ్ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి.
టర్నింగ్ తీసుకుంటున్న సమయంలో ఎదురుగా ఒక్కసారిగా బైక్ రావడంతో.. బైక్‌ను తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించారు. ఈ క్రమంలో డీసీఎంలోని లోడ్ ఒకవైపుకు జరగడంతో వాహనం అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని డీసీఎం డ్రైవర్ స్వయంగా వివరించారు.
ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలు కాగా, స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.




