Vikarabad: కుల్కచర్లలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు, విస్తృత సోదాలు!

Vikarabad: వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో పోలీసుల కాంటాక్ట్ ప్రోగ్రామ్. 54 బైకులు, 2 ఆటోలు, 34 లీటర్ల మద్యం స్వాధీనం.

WAZID, PARIGI
Published on: 9 Oct 2026 2:30 PM IST
Vikarabad
X

Vikarabad: కుల్కచర్లలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు, విస్తృత సోదాలు!

Vikarabad: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు.జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఐపీఎస్ ఆదేశాల మేరకు, పరిగి డీఎస్పీ ఎన్. శ్రీనివాస్ పర్యవేక్షణలో శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి 7 గంటల వరకు కిండిగేరి ప్రాంతంలో విస్తృత తనిఖీలు చేపట్టారు.

ఈ కార్యక్రమంలో 107 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని ఇళ్లను, వాహనాలను తనిఖీ చేయడంతో పాటు అనుమానాస్పద వ్యక్తుల కదలికలను పరిశీలించారు.ఈ తనిఖీల్లో 54 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 34 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు.

అలాగే ఇద్దరు రౌడీషీటర్లను తనిఖీ చేసి వారి వివరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా పరిగి డీఎస్పీ ఎన్. శ్రీనివాస్ ప్రజలకు పలు సూచనలు చేశారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు.

గ్రామాలు, ప్రధాన కూడళ్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరాల నియంత్రణకు సహకరించాలని తెలిపారు.పోలీసులు, ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం,

ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ప్రధాన లక్ష్యమని పోలీసులు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో పలువురు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, 12 మంది మహిళా పోలీసు కానిస్టేబుళ్లు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

WAZID, PARIGI

WAZID, PARIGI