Vikarabad: వికారాబాద్‌లో వైభవంగా పోలీస్ ఫ్లాగ్ డే పరేడ్ ప్రదర్శన!
Vikarabad: వికారాబాద్‌లో ఘనంగా పోలీస్ ఫ్లాగ్ డే పరేడ్. పాల్గొన్న కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ స్నేహ మెహ్రా. పోలీస్ అమరవీరులకు నివాళులు, వ్యాసరచన విజేతలకు అభినందన.
Vikarabad: వికారాబాద్‌లో వైభవంగా పోలీస్ ఫ్లాగ్ డే పరేడ్ ప్రదర్శన!
Vikarabad: వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ పర్యవేక్షణలో, పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (Police Commemoration Day) సందర్భంగా అక్టోబర్ 21న వికారాబాద్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీస్ ఫ్లాగ్ డే పరేడ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ దీపక్ తివారీ, ఐఏఎస్ ముఖ్య అతిథిగా హాజరై పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, ఐఏఎస్ కి జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ స్వాగతం పలికి వేదిక వద్దకు తీసుకెళ్లారు. పరేడ్ కమాండర్ ఆదేశాల మేరకు అమరవీరుల స్మారక పుస్తకాన్ని తీసుకువచ్చిన బృందం ఆ పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ గారికి అందజేసింది. అనంతరం జిల్లా కలెక్టర్ ఆ పుస్తకాన్ని జిల్లా ఎస్పీ గారికి, తదుపరి అదనపు ఎస్పీ (అడ్మిన్) గారికి అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, ఐఏఎస్ మాట్లాడుతూ, పోలీస్ అమరవీరుల త్యాగాలు దేశ భద్రతకు, ప్రజల శాంతిభద్రతల పరిరక్షణకు పునాదిగా నిలిచాయని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న నిర్వహించే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి గొప్ప చారిత్రక నేపథ్యం ఉందని తెలిపారు.
1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో దేశ సరిహద్దులను కాపాడుతున్న సమయంలో చైనా సైనికుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పది మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది త్యాగాలకు గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. పోలీస్ యూనిఫాం అనేది కేవలం అధికారానికి చిహ్నం మాత్రమే కాదని, అమాయకులను రక్షించడం, చట్టాన్ని గౌరవించడం, రాజ్యాంగ విలువలను కాపాడటం, ప్రమాదాలను ఎదుర్కొంటూ ప్రజలకు భద్రత కల్పించడం వంటి గొప్ప బాధ్యతలకు ప్రతీక అని కలెక్టర్ గారు అన్నారు.
విధి నిర్వహణలో ఎలాంటి ప్రమాదం ఎదురైనా, ప్రజల రక్షణే ప్రధాన లక్ష్యంగా పోలీసులు నిరంతరం సేవలందిస్తున్నారని కొనియాడారు.
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రణధీర్ ప్రసాద్ వర్మ, కే.ఎస్. వ్యాస్, అజయ్ కుమార్ సింగ్, సి. ఉమేష్ చంద్ర, బినోద్ కుమార్ చౌబే వంటి పోలీస్ అధికారుల సేవలను కలెక్టర్ గారు స్మరించుకున్నారు.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల కుటుంబాలకు సమాజం, ప్రభుత్వం నిరంతరం అండగా నిలవాలని, వారి త్యాగాలను ఎప్పటికీ మరచిపోకూడదని పేర్కొన్నారు. అమరవీరులు మన మధ్య లేకపోయినా, ప్రజలకు సేవ చేయాలనే వారి స్ఫూర్తి ప్రతి పోలీస్ అధికారిలో సజీవంగా ఉంటుందని అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్ గారు మాట్లాడుతూ, పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ప్రతి పోలీస్ అధికారి, సిబ్బందికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజని పేర్కొన్నారు. దేశ భద్రత, ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని తెలిపారు.
అమరవీరుల త్యాగాలు పోలీస్ శాఖకు నిరంతర స్ఫూర్తి అని, ప్రతి పోలీస్ అధికారి వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను సానుభూతితో విని, చట్ట పరిధిలో న్యాయం అందించేందుకు కృషి చేయాలని అన్నారు.
పోలీస్ అమరవీరుల కుటుంబాల త్యాగాలను కూడా సమాజం ఎప్పటికీ గుర్తుంచుకోవాలని, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.
విధి నిర్వహణలో ఎదురయ్యే ప్రమాదాలను ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడమే నిజమైన పోలీసింగ్ అని తెలిపారు. అమరవీరుల త్యాగం వృథా కాకుండా, వారు ఆశించిన సురక్షితమైన, ప్రశాంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీ రాజేశ్ మీనా గారు, 01-09-2025 నుంచి 31-08-2026 వరకు విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల పేర్లను చదివి వినిపించారు.
తదుపరి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీతో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది అమరవీరుల స్మారక స్థూపం వద్దకు చేరుకుని పుష్పగుచ్ఛాలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.
పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలు
పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమంలో భాగంగా పోలీస్ అధికారులు, సిబ్బందికి నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలను ప్రకటించి, వారి ప్రతిభను అభినందించారు.
1. ఎస్ఐలు మరియు అంతకంటే పైస్థాయి అధికారులు – సివిల్, ఏఆర్ విభాగాలు
మొదటి స్థానం: డబ్ల్యూఎస్ఐపీ మీనాక్షి, కోట్‌పల్లి పోలీస్ స్టేషన్.
రెండో స్థానం: ఎస్ఐపీ ఎం. ప్రశాంత్ వర్ధన్, పెద్దేముల్ పోలీస్ స్టేషన్.
మూడో స్థానం: ఎస్ఐపీ బి. మోహన కృష్ణ, పరిగి పోలీస్ స్టేషన్.
2. కానిస్టేబుళ్ల నుంచి ఏఎస్ఐల స్థాయి వరకు – సివిల్, ఏఆర్ విభాగాలు
మొదటి స్థానం: డబ్ల్యూపీసీ జె. ప్రత్యూష (10332), చెంగోముల్ పోలీస్ స్టేషన్.
రెండో స్థానం: పీసీ బి. సంతోష్ (10633), కరన్‌కోట్ పోలీస్ స్టేషన్.
మూడో స్థానం: డబ్ల్యూపీసీ సీహెచ్. దీపిక (11138), మార్పల్లి పోలీస్ స్టేషన్.
వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ రాజేశ్ మీనా, డీసీఆర్బీ డీఎస్పీ జనయ్య, డీటీసీ డీఎస్పీ శ్రీనివాస్, వికారాబాద్ డీఎస్పీ అంజయ్య, తాండూరు డీఎస్పీ యాదయ్య, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, ఏఆర్ డీఎస్పీ వీరేశ్‌తో పాటు సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తేదీ: 21-10-2026
పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం – వారి ఆశయాలను కొనసాగించడం ప్రతి పోలీస్ అధికారి బాధ్యత
వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో, జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్ గారి పర్యవేక్షణలో, పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (Police Commemoration Day) సందర్భంగా అక్టోబర్ 21న వికారాబాద్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీస్ ఫ్లాగ్ డే పరేడ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ దీపక్ తివారీ, ఐఏఎస్ గారు ముఖ్య అతిథిగా హాజరై పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న జిల్లా కలెక్టర్ శ్రీ దీపక్ తివారీ, ఐఏఎస్ గారికి జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్ గారు స్వాగతం పలికి వేదిక వద్దకు తీసుకెళ్లారు.
పరేడ్ కమాండర్ ఆదేశాల మేరకు అమరవీరుల స్మారక పుస్తకాన్ని తీసుకువచ్చిన బృందం ఆ పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ గారికి అందజేసింది. అనంతరం జిల్లా కలెక్టర్ గారు ఆ పుస్తకాన్ని జిల్లా ఎస్పీ గారికి, తదుపరి అదనపు ఎస్పీ (అడ్మిన్) గారికి అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ దీపక్ తివారీ, ఐఏఎస్ గారు మాట్లాడుతూ, పోలీస్ అమరవీరుల త్యాగాలు దేశ భద్రతకు, ప్రజల శాంతిభద్రతల పరిరక్షణకు పునాదిగా నిలిచాయని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న నిర్వహించే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి గొప్ప చారిత్రక నేపథ్యం ఉందని తెలిపారు. 1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో దేశ సరిహద్దులను కాపాడుతున్న సమయంలో చైనా సైనికుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పది మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది త్యాగాలకు గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు.
పోలీస్ యూనిఫాం అనేది కేవలం అధికారానికి చిహ్నం మాత్రమే కాదని, అమాయకులను రక్షించడం, చట్టాన్ని గౌరవించడం, రాజ్యాంగ విలువలను కాపాడటం, ప్రమాదాలను ఎదుర్కొంటూ ప్రజలకు భద్రత కల్పించడం వంటి గొప్ప బాధ్యతలకు ప్రతీక అని కలెక్టర్ గారు అన్నారు. విధి నిర్వహణలో ఎలాంటి ప్రమాదం ఎదురైనా, ప్రజల రక్షణే ప్రధాన లక్ష్యంగా పోలీసులు నిరంతరం సేవలందిస్తున్నారని కొనియాడారు.
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రణధీర్ ప్రసాద్ వర్మ, కే.ఎస్. వ్యాస్, అజయ్ కుమార్ సింగ్, సి. ఉమేష్ చంద్ర, బినోద్ కుమార్ చౌబే వంటి పోలీస్ అధికారుల సేవలను కలెక్టర్ గారు స్మరించుకున్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల కుటుంబాలకు సమాజం, ప్రభుత్వం నిరంతరం అండగా నిలవాలని, వారి త్యాగాలను ఎప్పటికీ మరచిపోకూడదని పేర్కొన్నారు. అమరవీరులు మన మధ్య లేకపోయినా, ప్రజలకు సేవ చేయాలనే వారి స్ఫూర్తి ప్రతి పోలీస్ అధికారిలో సజీవంగా ఉంటుందని అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్ గారు మాట్లాడుతూ, పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ప్రతి పోలీస్ అధికారి, సిబ్బందికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజని పేర్కొన్నారు. దేశ భద్రత, ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని తెలిపారు.
అమరవీరుల త్యాగాలు పోలీస్ శాఖకు నిరంతర స్ఫూర్తి అని, ప్రతి పోలీస్ అధికారి వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను సానుభూతితో విని, చట్ట పరిధిలో న్యాయం అందించేందుకు కృషి చేయాలని అన్నారు.
పోలీస్ అమరవీరుల కుటుంబాల త్యాగాలను కూడా సమాజం ఎప్పటికీ గుర్తుంచుకోవాలని, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఎదురయ్యే ప్రమాదాలను ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడమే నిజమైన పోలీసింగ్ అని తెలిపారు. అమరవీరుల త్యాగం వృథా కాకుండా, వారు ఆశించిన సురక్షితమైన, ప్రశాంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.