Vikarabad: పరిగిలో హిట్ అండ్ రన్ కేసు ఛేదన – కర్ణాటక కారు గుర్తింపు

Vikarabad: వికారాబాద్ జిల్లా పరిగిలో జరిగిన హిట్ అండ్ రన్ కేసును పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఛేదించారు. ప్రమాదానికి కారణమైన కర్ణాటక కారును గుర్తించారు.

WAZID, PARIGI
Published on: 13 Nov 2026 2:58 PM IST
Vikarabad
X

Vikarabad: పరిగిలో హిట్ అండ్ రన్ కేసు ఛేదన – కర్ణాటక కారు గుర్తింపు

వికారాబాద్: వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని సౌజన్య హాస్పిటల్ ముందు నిన్న జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో పోలీసులు కీలక పురోగతి సాధించారు.రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో అతను తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. కారు ఢీకొట్టిన ధాటికి బాధితుడు బారిగేట్‌పై పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలై భారీగా రక్తస్రావమైంది.ప్రమాదంలో గాయపడిన వ్యక్తి బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించినప్పటికీ, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. అయినప్పటికీ బాధితుడి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపినట్లు సమాచారం.మరోవైపు ప్రమాదానికి కారణమైన కారును గుర్తించేందుకు రంగంలోకి దిగిన పరిగి పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. సీసీ కెమెరాల ఆధారంగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన కారుగా గుర్తించారు. కారు నంబర్ KA 32 Z 0523గా నిర్ధారించారు.

ఈ వాహనంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పరిగి ఎస్‌ఐ మోహన్ కృష్ణ తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించిన పోలీసులు తదుపరి చర్యలు చేపడుతున్నారు.ఒకవైపు గాంధీ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న బాధితుడు.. మరోవైపు ప్రమాదానికి కారణమైన కారును గుర్తించిన పోలీసులు.. ఈ ఘటన పరిగిలో చర్చనీయాంశంగా మారింది.

WAZID, PARIGI

WAZID, PARIGI