Pargi: పరిగి ఐరన్ ఫ్యాక్టరీలో పోలీసుల మెరుపు సైలెంట్ ఆపరేషన్!
Pargi: వికారాబాద్ జిల్లా పరిగి సమీపంలోని లక్ష్మీదేవిపల్లి సుగుణ ఐరన్ ఫ్యాక్టరీలో పోలీసులు చేపట్టిన సైలెంట్ ఆపరేషన్‌లో 12 మంది కార్మికులకు డ్రగ్ పాజిటివ్ వచ్చింది.
Pargi: పరిగి ఐరన్ ఫ్యాక్టరీలో పోలీసుల మెరుపు సైలెంట్ ఆపరేషన్!
పరిగి: వికారాబాద్ జిల్లా పరిగిలో మాదకద్రవ్యాల వినియోగంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అందులో భాగంగా లక్ష్మీదేవిపల్లి సమీపంలోని సుగుణ ఐరన్ ఫ్యాక్టరీలో పోలీసులు చేపట్టిన సైలెంట్ ఆపరేషన్ స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు ముందస్తు సమాచారం లేకుండా పోలీసులు అత్యంత రహస్యంగా డ్రగ్ టెస్టులు నిర్వహించినట్లు సమాచారం.
సీసీఎస్ పోలీసులు, స్థానిక సివిల్ పోలీసుల ఆధ్వర్యంలో సుమారు 50 మంది పోలీసు సిబ్బంది ఈ ప్రత్యేక తనిఖీల్లో పాల్గొన్నారు. డ్రగ్ టెస్ట్ కిట్ల సహాయంతో కార్మికులకు అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించారు.ఈ పరీక్షల్లో దాదాపు 12 మందికి డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లు ప్రాథమిక సమాచారం. వీరు గంజాయి సేవించినట్లు పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే వీరికి మాదకద్రవ్యాలు ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి? ఫ్యాక్టరీ పరిసరాల్లో డ్రగ్స్ సరఫరా వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల్లో మాదకద్రవ్యాల వినియోగం వెలుగులోకి రావడం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. యువత, కార్మికులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పలువురు కోరుతున్నారు.




