Vikarabad: మెతుకు ఆనంద్‌పై కాంగ్రెస్ వ్యాఖ్యలను ఖండించాలి

Vikarabad: ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌పై కాంగ్రెస్ నాయకులు చేసిన అవమానకర వ్యాఖ్యలను ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా ఖండించారు.

MOGULAIAH, VIKARABAD
Published on: 8 Oct 2026 4:49 PM IST
Vikarabad
X

Vikarabad: మెతుకు ఆనంద్‌పై కాంగ్రెస్ వ్యాఖ్యలను ఖండించాలి

వికారాబాద్: ప్రజా సమస్యలపై ప్రతిపక్ష నాయకుడిగా స్పందిస్తున్న మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌పై కాంగ్రెస్ పార్టీకి చెందిన కింది స్థాయి నాయకులు అసభ్యకరంగా, అవమానకరంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రతిపక్ష నాయకులు పేర్కొన్నారు.

మెతుకు ఆనంద్‌పై దాడి చేస్తామని, డప్పులతో దాడి చేస్తామని చెప్పడం వంటి వ్యాఖ్యలు దళిత సమాజాన్ని అవమానించేలా ఉన్నాయని వారు ఆరోపించారు. దళితులు ఏ ఒక్క రాజకీయ పార్టీకి పేటెంట్ కాదని, అన్ని రాజకీయ పార్టీల్లోనూ దళితులు ఉన్నారని పేర్కొన్నారు.

నెహ్రూ కాలం నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ దళితులు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ వంటి నాయకుల విషయంలో అన్యాయం చేసిందంటూ వారు విమర్శలు చేశారు.

వికారాబాద్‌లో ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే రాజకీయంగా సమాధానం చెప్పాల్సింది పోయి దాడులు, బెదిరింపుల భాషను ఉపయోగించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. ఇలాంటి రాజకీయ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలే తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD