Vikarabad: విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రజలపై ఉండాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ అనన్య!

Vikarabad: వికారాబాద్ 32వ వార్డులో వినాయక అన్నప్రసాద వితరణలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య. నిమజ్జనాల్లో చిన్నారుల పట్ల జాగ్రత్త వహించాలని సూచన.

MOGULAIAH, VIKARABAD
Published on: 19 Sept 2026 6:04 PM IST
Vikarabad
X

Vikarabad: విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రజలపై ఉండాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ అనన్య!

వికారాబాద్: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 32వ వార్డు శివరాంనగర్ కాలనీలో కౌన్సిలర్ బాదం అనురాధ అశోక్ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వికారాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య, వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్, వైస్ చైర్మన్ మల్లేశం, మాజీ వైస్ చైర్మన్ సి. రమేష్ కుమార్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ గడ్డం అనన్య మాట్లాడుతూ ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజించి ఆధ్యాత్మిక చింతనతో ఉండాలని కోరారు. వినాయక నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు, నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

యువత కలిసికట్టుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు సహకరించాలని, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, విజయవంతంగా జరిగేందుకు పోలీస్ శాఖకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ వార్డుల కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD