Pargi: కపిలగిరిలో ఆంజనేయస్వామి భారీ విగ్రహానికి భూమిపూజ!

Pargi: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల పరిధిలోని కపిలగిరి కోతుల గుట్టపై భారీ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమిపూజ జరిగింది.

WAZID, PARIGI
Published on: 12 Oct 2026 4:04 PM IST
Pargi
X

Pargi: కపిలగిరిలో ఆంజనేయస్వామి భారీ విగ్రహానికి భూమిపూజ!

PARGI: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కపిల గిరి క్షేత్రం.. కోతుల గుట్టపై ఆంజనేయస్వామి భారీ విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి సతీమణి శ్రీమతి ఉమా రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆంజనేయస్వామి ఆశీస్సులతో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. స్వామివారి ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలని ప్రార్థించారు.

కపిల గిరి క్షేత్రంలో భారీ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమిపూజ నిర్వహించడంతో స్థానిక భక్తుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

WAZID, PARIGI

WAZID, PARIGI