Vikarabad: వికారాబాద్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Vikarabad: వికారాబాద్ పట్టణంలోని శివరాంనగర్ కాలనీ 31, 32 వార్డులలో బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు ఆటపాటలతో సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

MOGULAIAH, VIKARABAD
Published on: 18 Oct 2026 9:43 PM IST
Vikarabad
X

Vikarabad: వికారాబాద్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

వికారాబాద్‌: వికారాబాద్ పట్టణంలోని శివరాంనగర్ కాలనీ 31వ వార్డు 32 వార్డు లలో బతుకమ్మ పండుగ వేడుకలు అత్యంత ఘనంగా, వైభవంగా జరిగాకెక్కినాయి. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను స్థానిక మహిళలు సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.

పూలతో బతుకమ్మలను అందంగా తీర్చిదిద్ది, వార్డులోని మహిళలంతా ఒక్కచోట చేరి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ, తెలంగాణ ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో బతుకమ్మ పాటలు పాడుతూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ నృత్యాలు చేశారు.

ఈ వేడుకల్లో కాలనీవాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఒకరికొకరు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా సాగిన ఈ వేడుకలు కాలనీలో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. అనంతరం బతుకమ్మలను సమీపంలోని జలవనరులలో నిమజ్జనం చేయడంతో సంబరాలు ముగిశాయి.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD