Vikarabad: ఆలంపల్లిలో పద్మనాభ స్వామి పల్లకీ సేవలో మాజీ ఎమ్మెల్యే!
Vikarabad: మనిషి శరీరానికి యోగ, మనసుకు ఆధ్యాత్మికత ఎంతో అవసరమని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. నియోజకవర్గంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Vikarabad: ఆలంపల్లిలో పద్మనాభ స్వామి పల్లకీ సేవలో మాజీ ఎమ్మెల్యే!
వికారాబాద్: వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు ఈరోజు (19-10-2026, సోమవారం) పలు ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలంపల్లి: శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి పల్లకీ సేవల్లో పాల్గొన్నారు.
శివారెడ్డిపేట: దుర్గామాత ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
నవాబుపేట మండలం మీనేపల్లి కలాన్ గ్రామంలో నిర్వహించిన అమ్మవారి బోనాల ఉత్సవాల్లో పాల్గొని భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో భక్తిభావంతో పూజా కార్యక్రమాల్లో పాల్గొని, ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. భక్తి.. సంప్రదాయం.. ఆధ్యాత్మికతకు ప్రతీకగా ధార్మిక కార్యక్రమాల్లో డాక్టర్ మెతుకు ఆనంద్ గారి భాగస్వామ్యం.




