Vikarabad: దౌల్తాబాద్ పెద్ద చెరువులో మొసలి హల్చల్.. భయాందోళన
Vikarabad: వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ పెద్ద చెరువులో మొసలి సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. అటవీ అధికారులు స్పందించి దాన్ని బంధించాలని కోరుతున్నారు.
Vikarabad: దౌల్తాబాద్ పెద్ద చెరువులో మొసలి హల్చల్.. భయాందోళన
వికారాబాద్: వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని పెద్ద చెరువులో మొసలి గత కొంతకాలంగా హల్చల్ చేస్తూ స్థానిక ప్రజలకు భయాందోళనకు గురిచేస్తుంది. గతంలో దీన్ని గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని ఇచ్చారు.
అటవీ శాఖ అధికారులు దాన్ని బంధించడానికి కొంత ప్రయత్నం చేసి బంధించడంలో విఫలమయ్యారు. ప్రస్తుతం అప్పుడప్పుడు అక్కడక్కడ మొసలి కనిపిస్తూ స్థానిక ప్రజలకు భయాందోళనకు గురిచేస్తుంది.
ఇటీవల నీరు త్రాగడానికి వెళ్లిన ఓ బర్రెపై దాడి కూడా చేసింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి దాన్ని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.




