Vikarabad: మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ వ్యాఖ్యలపై అర్థ సుధాకర్ రెడ్డి ఫైర్

Vikarabad: స్పీకర్‌ను 'దొర' అని సంబోధించిన మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తీరును కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అర్థ సుధాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

MOGULAIAH, VIKARABAD
Published on: 7 Oct 2026 10:43 PM IST
Vikarabad
X

Vikarabad: మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ వ్యాఖ్యలపై అర్థ సుధాకర్ రెడ్డి ఫైర్

వికారాబాద్: ఓడిపోయిన బాధలో, ప్రజలు తిరస్కరించారనే ఫ్రస్ట్రేషన్ లో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని "దొర" అని పిలవడం ఆయన సంస్కారహీనతకు నిదర్శనమని మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్థ సుధాకర్ రెడ్డి ధ్వజమెత్తారు.

ధరూర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దగ్గర నోరు జారిన మాజీ ఎమ్మెల్యే..

ధరూర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల గురించి మాట్లాడుతూ స్పీకర్ గారిని కించపరిచేలా మాట్లాడటం సరైన పద్ధతి కాదు.10 ఏళ్లు అధికారంలో ఉండి వికారాబాద్ ను అభివృద్ధి చేయకుండా భ్రష్టు పట్టించిన మీరు, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తారా?

మీ BRS పాలనలో ఏం చేశారు?

మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే పేదోడికి అన్నం పెడుతున్నాం, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఇచ్చాం, రైతన్నకు ఉచిత కరెంటు ఇచ్చాం, ప్రతి ఇంటికి సన్న బియ్యం ఇస్తున్నాం. మీరు 10 ఏళ్లు ఏం చేశారు? ఇప్పుడు ప్రజా సమస్యలపై మాట్లాడటం చేతకాక స్పీకర్ గారిపై ఏడుస్తున్నారా?

అర్థ సుధాకర్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్:

ఇదే మీకు చివరి హెచ్చరిక. ఇకపై స్పీకర్ గారిని గానీ, మా కాంగ్రెస్ పార్టీ నాయకులను గానీ ఇలాంటి భాషతో విమర్శిస్తే ఊరుకునేది లేదు. మీ పద్ధతి మార్చుకోండి. లేదంటే వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి మీ ఇంటిని ముట్టడించి, మిమ్మల్ని నిర్భందిస్తాం ఖబర్దార్ ఆనంద్ గారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD