Pargi: పరిగిలో వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారీ ఆకస్మిక తనిఖీలు!

Pargi: పరిగిలో వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారీ సుడిగాలి పర్యటన బీసీ బాలికల హాస్టల్, సీహెచ్‌సీ ఆసుపత్రి, SIR ఓటరు నోటీసులు, మిషన్ భగీరథ పనుల ఆకస్మిక తనిఖీ.

WAZID, PARIGI
Published on: 29 Sept 2026 6:40 PM IST
Pargi
X

Pargi: పరిగిలో వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారీ ఆకస్మిక తనిఖీలు!

PARGI: వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ బాలికల హాస్టల్‌ను తనిఖీ చేసిన కలెక్టర్.. వంటశాల, భోజనం, మెనూ, విద్యార్థుల హాజరు రిజిస్టర్లు, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్‌ను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి చదువు, విద్యా ప్రగతిపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన సౌకర్యాలు అందించాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం పరిగి మున్సిపాలిటీలో SIR ఓటరు సవరణ నోటీసుల జారీ ప్రక్రియను పరిశీలించారు. BLOలను అడిగి నోటీసుల జారీ, పెండింగ్ వివరాలను తెలుసుకుని, ఓటర్లకు నోటీసులు సక్రమంగా అందించి రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు.

తర్వాత నిర్మాణంలో ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌లను పరిశీలించి, పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చివరగా పరిగి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను తనిఖీ చేసిన కలెక్టర్.. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. ల్యాబ్, ఎక్స్‌రే, మందుల నిల్వలు, ఎమర్జెన్సీ, ఐసీయూ, వార్డులను పరిశీలించారు. రోగులకు నాణ్యమైన వైద్యం, పరిశుభ్రమైన ఆహారం అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు.కలెక్టర్ వెంట బీసీ వెల్ఫేర్ అధికారి మాధవరెడ్డి, ఆర్డీవో వాసుచంద్ర, మున్సిపల్ కమిషనర్ మల్లేశం, తహసీల్దార్ వెంకటేశ్వరి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

WAZID, PARIGI

WAZID, PARIGI