Vikarabad: దేశ నిర్మాణంలో విశ్వకర్మల పాత్ర వెలకట్టలేనిది: కలెక్టర్!

Vikarabad: వికారాబాద్ కలెక్టరేట్‌లో ఘనంగా విరాట్ విశ్వకర్మ వేడుకలు. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహర.

MOGULAIAH, VIKARABAD
Published on: 17 Sept 2026 6:01 PM IST
Vikarabad
X

Vikarabad: దేశ నిర్మాణంలో విశ్వకర్మల పాత్ర వెలకట్టలేనిది: కలెక్టర్!

వికారాబాద్: గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం హాలు నందు బి సి వెల్ఫేర్ అధికారి ఆధ్వర్యంలో విరాట్ విశ్వకర్మ వేడుకలనుజిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ స్నేహ మెహర, అదనపు కలెక్టర్ లు ఉమా శంకర్ ప్రసాద్, వెంకటాచారి లతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో జడ్ పి సి ఇ ఓ సుధీర్, డి ఆర్ ఓ స్వర్ణలత, బి సి వెల్ఫేర్ అధికారి మాధవ రెడ్డి, ఎస్సి వెల్ఫేర్ జయపాల్ రెడ్డి, ఎస్టీ జనార్దన్, డి పి ఓ జయసుధ, జిల్లా అధికారులు, ఉద్యోగులు, విశ్వకర్మ సంఘం ప్రతి నిధులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ విశ్వకర్మ సమాజం దేశ నిర్మాణంలో, కళలు, వృత్తులు, శిల్పకళ మరియు చేతివృత్తుల అభివృద్ధిలో అందిస్తున్న సేవలను కొనియాడారు.

విశ్వకర్మ వృత్తిదారుల సంక్షేమం, వారి నైపుణ్యాల అభివృద్ధి, ప్రభుత్వ పథకాల ద్వారా వారికి అందుతున్న ప్రయోజనాలను విస్తృతంగా అందించేందుకు కృషి చేయాలని సూచించారు. సంప్రదాయ వృత్తులను పరిరక్షిస్తూ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD