Vikarabad: వికారాబాద్ క్రైమ్ కానిస్టేబుళ్లతో అదనపు ఎస్పీ రాజేష్ మీనా సమీక్ష!

Vikarabad: వికారాబాద్ క్రైమ్ కానిస్టేబుళ్లతో అదనపు ఎస్పీ రాజేష్ మీనా సమీక్ష ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాలతో ఎన్‌డీపీఎస్, దొంగతనాల కేసుల ఛేదనపై దిశానిర్దేశం, సాంకేతికత వాడకం తప్పనిసరి.

MOGULAIAH, VIKARABAD
Published on: 29 Sept 2026 7:24 PM IST
Vikarabad
X

Vikarabad: వికారాబాద్ క్రైమ్ కానిస్టేబుళ్లతో అదనపు ఎస్పీ రాజేష్ మీనా సమీక్ష!

వికారాబాద్: వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో క్రైమ్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లతో వికారాబాద్ జిల్లా అదనపు ఎస్పీ రాజేష్ మీనా, IPS ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో NDPS కేసుల దర్యాప్తు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరియు వినియోగం నియంత్రణ, దొంగతనం కేసుల ఛేదన, నేరస్తులపై నిఘా, పెండింగ్ కేసుల దర్యాప్తు, నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై క్రైమ్ సిబ్బందికి అవగాహన కల్పించారు.

మాదకద్రవ్యాల విక్రయం, సరఫరా మరియు రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించి, వారి కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలని అదనపు ఎస్పీ సూచించారు.

అలాగే దొంగతనం కేసుల్లో నేరస్తుల కదలికలను గుర్తించడం, పాత నేరస్తులపై నిఘా, కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించడం ద్వారా కేసులను త్వరితగతిన ఛేదించాలని సిబ్బందికి సూచించారు.

నేర నియంత్రణలో క్రైమ్ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తారని, సమాచార సేకరణ, విశ్లేషణ మరియు దర్యాప్తు అధికారులు, ఇతర విభాగాలతో సమన్వయంతో పనిచేసి నేరాల నివారణకు కృషి చేయాలని అదనపు ఎస్పీ రాజేష్ మీనా ఆదేశించారు. ఈ సమావేశంలో CCS ఇన్‌చార్జ్ సీఐ బల్వంత్ తదితరులు పాల్గొన్నారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD