Hyderabad: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు!

Hyderabad: పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్. పాల్గొన్న బీజేపీ నేత జూటూరు కీర్తిరెడ్డి.

RAJESH,	WEST ZONE
Published on: 17 Sept 2026 2:03 PM IST
Hyderabad
X

Hyderabad: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు!

Hyderabad: 1948 సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమైన రోజన్నారు బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జూటూరు కీర్తిరెడ్డి. నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొంది భారత యూనియన్‌లో విలీనమైన ఈ రోజును తెలంగాణ ప్రజలందరికీ పండుగ రోజని గుర్తుచేశారామె.

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గురువారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ విమోచ‌న దినోత్సవ వేడుక‌లకు భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరై గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్ కుమార్ తో క‌లిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఇక ఈ ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ ఎగ్జికుటీవ్ మెంబ‌ర్ జూటురు కీర్తిరెడ్డి పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. ఆనాటి పోరాట యోధుల త్యాగాలను స్మరించుకున్నారు. అనంత‌రం ఆమె మాట్లాడుతూ... “1948 సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలందరికీ ఓ పండుగ రోజనీ నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడిన రోజు. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కోసం ఎందరో పోరాట యోధులు తమ ధన, మాన, ప్రాణాలను త్యాగం చేశారని గుర్తుచేశారు. వారి పోరాట పటిమను, త్యాగాలను ఈ సమాజం ఎప్పటికీ మరిచిపోకూడదన్నారామె.

దేశ చరిత్రలో ఒక కీలక ఘట్టం

హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయాలన్న సంకల్పంతో ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ తీసుకున్న నిర్ణయాత్మక చర్యలు, 1948లో జరిగిన ఆపరేషన్ పోలో దేశ చరిత్రలో కీలక ఘట్టమన్న కీర్తిరెడ్డి... “ఈపోరాటంలో ప్రాణత్యాగాలు చేసిన వీరుల స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

చరిత్రను భావితరాలకు చేర్చాలి

ఈ “తెలంగాణ విమోచన పోరాట చరిత్రను కొంద‌రు త‌మ రాజ‌కీయ‌ ప్రయోజనాల కోసం మరుగునపర్చే ప్రయత్నాలు చేస్తున్నార‌ని కీర్తిరెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రం విమోచ‌నం ఎలా జ‌రిగిందోన‌న్న‌ చరిత్రను తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా భావితరాలకు నిజాం పాలన అరాచ‌కాల‌ను, అమరవీరుల త్యాగాలు, హైదరాబాద్ భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక పరిణామాలను తెలియ‌జెప్పేందుకే ప్ర‌తియేటా కేంద్ర ప్రభుత్వం విమోచన దినోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్న‌ట్లు తెలిపారామె.

“తెలంగాణ చరిత్రను, అమరవీరుల త్యాగాలను గౌరవించే విషయంలో బీజేపీ ఎప్పుడూ ముందుంటుందన్న కీర్తిరెడ్డి... భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామ‌ని స్పష్టం చేశారు కీర్తిరెడ్డి.

ఆకట్టుకున్న పోలీసుల కవాతు

విమోచన దినోత్సవ వేడుకల్లో పోలీసు, కేంద్ర సాయుధ బలగాల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు భద్రతా బలగాలు, వివిధ విభాగాల అధికారులు గౌరవ వందనం సమర్పించిన తీరుఆహూతులను ఆకట్టుకుంది.

సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్ గా.. సాంస్కృతి కళాప్రదర్శన

ఈ వేడుకల్లో తెలంగాణ సంప్రదాయ కళారూపాలు, జానపద ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పేరిణి నృత్యం, ఆదిలాబాద్ గోండు నృత్యాలు, డప్పుల దరువులు, డోలు వాయిద్యాలు వంటి కళారూపాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయ వైభవాన్ని చాటిచెప్పాయి.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు తదితరులతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE