Hayathnagar: వికలాంగుల కమ్యూనిటీ హాల్‌ను వారి అవసరాలకే వినియోగించాలి!
Hayathnagar: హయత్‌నగర్ మండల కార్యాలయ ప్రాంగణంలోని వికలాంగుల కమ్యూనిటీ హాల్‌ను వారి అవసరాలకే కేటాయించాలని VHPS వైస్ చైర్మన్ అందే రాంబాబు డిమాండ్ చేశారు.
Hayathnagar: వికలాంగుల కమ్యూనిటీ హాల్‌ను వారి అవసరాలకే వినియోగించాలి!
Hayathnagar: హయత్‌నగర్ మండల కార్యాలయ ప్రాంగణంలో వికలాంగుల కోసం నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను వారి అవసరాలకే వినియోగించాలని VHPS కోర్ కమిటీ వైస్ చైర్మన్ అందే రాంబాబు డిమాండ్ చేశారు.
వికలాంగుల హక్కుల పోరాట సమితి (VHPS) ఆధ్వర్యంలో ప్రజావాణిలో భాగంగా అబ్దుల్లాపూర్‌మెట్ ఎంపీడీవో శ్రీ వాణిని కలిసి వినతిపత్రం అందజేశారు. 2013లో బీఎంపీఆర్‌వై నిధులతో నిర్మించిన ఈ భవనాన్ని ప్రస్తుతం 108 సిబ్బంది వినియోగిస్తున్నారని తెలిపారు. దీంతో వికలాంగుల సంఘాలు సమావేశాలు నిర్వహించుకునేందుకు ఇతర హాళ్లను ఆశ్రయించాల్సి వస్తోందన్నారు.
వెంటనే కమ్యూనిటీ హాల్‌ను వికలాంగుల అవసరాలకు కేటాయించాలని, లేనిపక్షంలో VHPS ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో తేజావత్ కొమురయ్య నాయక్, బి. రామచంద్రయ్య, గొల్ల పాండు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.




